మస్క్యులర్ డిస్ట్రఫీతో బాధపడుతున్న చిన్నారికి బ్యాటరీ వీల్ ఛైర్

Battery wheel chair for a child suffering from muscular distress
* చిన్నారి రేవతి కుటుంబానికి ఆర్ధిక సాయం
Date:19/05/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
విజయవాడలో పౌరోహిత్యం చేసుకొంటూ చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు సత్తిరాజు విజయకృష్ణ. ఆ పేద పురోహితుని చిన్న కుమార్తె రేవతికి పుట్టుకతోనే కండరాలకు సంబంధించిన మస్క్యులర్ డిస్ట్రఫీ అనే వ్యాధితో బాధపడుతోంది. కాళ్ళు, చేతులు బిగుసుకుపోవడం, మెడ నిలబెట్టలేకపోవడం లాంటి సమస్యలతో రేవతి ఇబ్బందులుపడుతోంది. తగిన వైద్యం చేయించకపోతే ఒక్కో అవయవం క్షీణించిపోయే ప్రమాదం ఉంది. ఖరీదైన వైద్యం చేయించే స్తొమత ఆ కుటుంబానికి లేదు. మైసూరులోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంవారు వైద్యం చేయిస్తామని చెప్పారు. చికిత్స పూర్తయ్యే వరకూ కుటుంబం మైసూరులోనే ఉండాలి. విజయవాడ నుంచి మైసూర్ వెళ్ళేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. రేవతికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. ఒక్కసారైనా కలిసి మాట్లాడాలని మారాం చేసేది. ఆ చిన్నారిని తల్లితండ్రులు లక్ష్మీసుమ, విజయకృష్ణ, అక్క జయలక్ష్మి  ఉత్తరాంధ్ర నుంచి ‘జన పోరాట యాత్ర’కు సిద్దమవుతున్న పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకువచ్చారు. విశాఖపట్నంలో శనివారం ఉదయం ఆ కుటుంబం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసింది. మస్క్యులర్ డిస్ట్రఫీతో బాధపడుతున్న రేవతి పరిస్థితి చూసి ఆయన చలించిపోయారు. ఆ చిన్నారికి అవసరమైన బ్యాటరీ వీల్ ఛైర్ సమకూర్చడంతోపాటు వైద్యం కోసం మైసూరుకు వెళ్ళేందుకు ఆర్ధిక సాయం చేస్తామని పవన్ కళ్యాణ్  చెప్పారు. ఆయన ఇచ్చిన భరోసాతో ఆ పేద కుటుంబం ఎంతో సంతోషపడింది.
Tags; Battery wheel chair for a child suffering from muscular distress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *