అధికారంలోకి వచ్చాక బాక్సైట్ మైనింగ్ నిలిపివేస్తాం

Bauxite mining will be stopped after coming to power

Bauxite mining will be stopped after coming to power

-ఎస్ చేసిన తప్పే చంద్రబాబు కొనసాగించారు
– బాధ్యతాయుతమైన మైనింగ్ పాలసీయే జనసేన లక్ష్యం
– జనసేన అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్
– జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రిశ్రీ పసుపులేటి బాలరాజు
Date:10/11/2018
విజయవాడ ముచ్చట్లు:
ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం సన్నగిల్లకుండా చూడటమే జనసేన పార్టీ లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారు పేర్కొన్నారు.  పర్యావరణం పరిరక్షించుకునే అభివృద్ధి ప్రస్థానానికి జనసేన కట్టుబడి ఉందని, 2019లో పార్టీ అధికారంలోకి వస్తే బాక్సైట్ మైనింగ్ నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉద్ధృతంగా మైనింగ్ జరుగుతున్నప్పుడు అదే పార్టీలో ఉండి దానిని వ్యతిరేకించిన వ్యక్తి పసుపులేటి బాలరాజు గారని, అలాంటి వ్యక్తి జనసేనలోకి రావడం మనస్ఫూర్తిగా ఆనందం కలిగించిందని అన్నారు.
శనివారం ఉదయం విజయవాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి  పసుపులేటి బాలరాజు జనసేనలో చేరారు. ఆయనకు  పవన్ కల్యాణ్   పుష్పగుచ్చం ఇచ్చి, జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా  పవన్ కల్యాణ్  మాట్లాడుతూ..”జనసేన పార్టీ ప్రారంభించినప్పడు పెద్దస్థాయి, అనుభవం ఉన్న నాయకులు లేరు. అంతా టీనేజర్సే. మన ఆశయాలు బలంగా ఉంటే విలువలున్న నాయకులు వస్తారని ఆనాడు ముందడుగు వేశాం.
ఆ ఆశయమే ఇవాళ  నాదెండ్ల మనోహర్,  పసుపులేటి బాలరాజు ని మన పార్టీలో చేరేలా చేసింది. పర్యావరణం పరిరక్షించే అభివృద్ధి ఉండాలనే ఆలోచన మమ్మల్ని కలిపింది. 150మందికి పైగా శాసనసభ సభ్యులను విశాఖ ఏజెన్సీకి తీసుకెళ్లి, గిరిజనుల పడుతున్నఅవస్థలు, ఆరోగ్య పరిస్థితి, వారి జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో ప్రత్యక్షంగా చూపించి ప్రజాప్రతినిధులు చలించేలా చేసిన మనోహర్ గారు,  ఆ రోజు మనోహర్ కు అండగా నిలబడ్డ బాలరాజు  గురించి ఇటీవల పాడేరులో పర్యటిస్తున్నప్పుడు తెలిసింది.
అలాంటి బాలరాజు గారు పార్టీలోకి రావడం సంతోషాన్ని ఇచ్చింది. బాలరాజు  సలహాలు, సూచనలు, ఆయన అనుభవం గిరిజన ప్రాంతాల్లో పార్టీ బలోపేతం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది.   ఇటీవల వంతాడ గ్రామానికి వెళ్తే మైనింగ్ జరగడం లేదన్నారు… ప్రత్యక్షంగా వెళ్లి చూస్తే కొండల్ని పిండి చేస్తున్నారు. కేవలం 0.4 శాతం ప్రభుత్వానికి రాయల్టీ ఇచ్చి వేల కోట్లు దోచేస్తున్నారు. కనీసం వంతాడ గ్రామానికి మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదు.
రిజర్వ్ ఫారెస్ట్ లో అడ్డగోలుగా మైనింగ్ చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు  చెబుతున్న రియల్ టైం గవర్నెన్స్  ఎక్కడుంది? వంతాడ అక్రమ మైనింగ్ విషయంలో  వైఎస్ . రాజశేఖర రెడ్డి చేసిందే పెద్ద తప్పు. అయితే దానికి కొనసాగించిన టీడీపీ ప్రభుత్వానిది ఇంకా పెద్ద తప్పు. 2014లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది గిరిజనుల హక్కులకు పరిరక్షిస్తారని. కానీ వారు గిరిజనుల జీవితాలను నాశనం చేస్తున్నారు. 2019లో జనసేన పార్టీ గెలుస్తుందా..?
లేదా అని ఆలోచించకుండా సామాజిక మార్పే లక్ష్యంగా పార్టీలో చేరిన బాలరాజు గారికి మాటిస్తున్నా .. పార్టీ అధికారంలోకి వస్తే బాధ్యతయుతమైన మైనింగ్ పాలసీ తీసుకురావడంతో పాటు, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తాం” అన్నారు.
Tags; Bauxite mining will be stopped after coming to power

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *