బి.సి కులాల వారికి బి.సి కార్పోరేషన్ సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి           ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి

హైదరాబాద్ ముచ్చట్లు:

 

కరోనా కష్టాలలో బి.సి కుల వృత్తులు – చేతి వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ బి.సి కులాల వారు ఆకలి చావులు చచ్చే ప్రమాదం ఏర్పడింది. కావున ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించి ఈ బి.సి కులాల వారికి బి.సి కార్పోరేషన్ సబ్సిడీ రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని   జాతీయ బి.సి సంక్షేమ సంఘం  అద్యక్షులు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేసారు.కులవృత్తులు చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారి బ్రతుకులు గడవడం లేదన్నారు. హెయిర్ కటింగ్ షాపులకు ప్రజలు రావడం లేదు. దీనిపై ఆధారపడి బతుకుచున్న నాయి బ్రహ్మణ, మంగలి కులస్తులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. అద్దెలు కట్టలేక అప్పుల పాలవుతున్నారు. ఎవరి బట్టలు వారు స్వచ్ఛంగా ఉతుకుంటున్నారు. దీనితో డ్రై క్లీన్ షాపులు నడువడం లేదు. రజక వృత్తి దారులు చాల కష్టాలు పడుతున్నారు. అలాగే దర్జీ వృత్తి నడువడం లేదు. జువెల్లరి షాపులు ప్రజలు రాక ముఠా పడ్డాయి. వడ్రంగి వృతి – కమ్మరి, కుమ్మరి వృత్తుల వారు, మేదరి వృత్తులవారు వృత్తులు కొనసాగాక అష్ట కష్టాలు పడుతున్నారు. అప్పుల పాలయ్యారు. అద్దెలు కట్టలేక షాపులు మూసివేశారు. వీరిని ప్రభుత్వం ఆర్ధికంగా చేయూతనిచ్చి అందుకోకపోతే ఆకలి-చావులతో చచ్చే ప్రమాదం యుంది. వీరి షాపులకు అద్దె చెల్లించడం లేదు. అప్పులు పుట్టడం లేదు.  తిండి లేక ఆకలితో చచ్చే రోజులోచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.స్వయం ఉపాధి పథకాలకు ముఖ్యంగా కులవృత్తులు, చేతివృత్తుల పథకాలు, కిరాణా షాపులు, మెడికల్ షాపులు, కూరగాయల షాప్ లు, జిరాక్స్ సెంటర్లు, బ్యూటీ పార్లర్లు, బట్టల దుకాణాలు, డ్రై క్లీనింగ్ షాపులు హెయిర్ కటింగ్ సేలున్స్, బైక్, కార్లు మెకానిక్ సర్వీస్ సెంటర్లు, టైర్ల దుకాణాలు, బెకరి షాపులు, చిన్న హోటల్స్, టిఫిన్ సెంటర్లు, TV కంప్యుటర్ రిపేరింగ్ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్ తదితర స్వయం ఉపాధి పథకాల కోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకొని ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని వీరికి రుణాలు ఇవ్వకుండ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.బీసీ కార్పొరేషన్ మరియు 12 బీసీ కుల ఫెడరేషన్ల ద్వారా 3 సంవత్సరాల క్రితం తీసుకున్న 5లక్షల 77 వేల దరఖాస్తు దారులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు దరఖాస్తుదారులoదరికీ రుణాలు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల తర్వాత ఈ దరఖాస్తుదారులను పెండింగ్ లో పెట్టారు. దరఖాస్తుదారులు రుణాల కోసం బీసీ కార్పొరేషన్ ఆఫీసుల చెట్టు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కుల ఫెడరేషన్లలో దరఖాస్తులు చేసిన వారు మార్జిన్ మనీ డిపాజిట్ కింద 50 శాతం డబ్బును అప్పులు చేసి బ్యాంకులో డిపాజిట్ చేశారు. వడ్డీలు కట్టలేక దరఖాస్తుదారులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వెంటనే రుణాలు మంజూరు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:BC Corporation should grant subsidized loans to BC castes
Appeal to Chief Minister KCR R. Krishnaiah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *