బీసీలకు 24 శాతం సీట్లు ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు

BCCI should give 24 per cent seats - Supreme Court

BCCI should give 24 per cent seats - Supreme Court

Date:31/12/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
బీసీ లకు పంచాయతీ ల్లో 24 శాతం సీట్లు ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పింది. 24 శాతానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా వేసింది. ఎస్ఎల్పీని కూడా సుప్రీం కోర్టు కొట్టి వేయడం తో బాధాకర పరిస్థితు ల్లో సీఎం కెసిఆర్ ఆ తీర్పు ను అంగీకరించారని తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. సోమవారం అయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.  విపక్ష నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  కోదండరాం లు బీసీ ల పై మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. అధికారం లో ఉండగా కాంగ్రెస్ నేతలు బీసీ ఫెడరేషన్లకు ఒక్క పైసా కేటాయించలేదని విమర్శించారు. బీసీ లకు 90 శాతం సబ్సిడీ తో ఇప్పుడు పెట్టుబడి సమకూరుస్తున్నాం. బీసీ లను అన్ని విధాల అణచివేసిన నేతలే ఇపుడు గొంతు పెద్దదిగా చేసుకుని మాట్లాడుతున్నారు. .అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాతే బీసీ లకు కోర్టు నిర్ణయించిన రిజర్వేషన్లకు ఒప్పుకున్నామని అయన అన్నారు.
కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే చట్టసభల్లో బీసీ లకు 33 శాతం రిజెర్వేషన్ల కోసం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తీర్మానాలు చేయించాలి. విపక్ష నేతలు ఇల్లు కాలితే పేలాలు ఏరుకుంటున్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీకి  అఖిల పక్షం గా వెళ్లినా ప్రస్తుత పరిస్థితుల్లో సాధించేది ఏమి ఉండదని అయన స్పష్టం చేసారు. ఆర్ కృష్ణయ్య కుడా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. తమిళనాడు తరహా లో తెలంగాణ లో రిజెర్వేషన్లు సాధించేందుకు అన్ని పార్టి లు సహకరించాలి. బీసీ లకు ఎవరేం చేశారో తేల్చుకునేందుకు ఉత్తమ్ దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రావాలి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నారు. కెసిఆర్ భాష ను చంద్రబాబు తప్పు పడుతున్నారు. చంద్రబాబు లాగా కెసిఆర్ కు అండీ లు గిండీలు రావు. మోడీ కి చంద్రబాబు కు ఏం పంచాయతీ ఉందో. ఆ వివాదం లో కెసిఆర్ ను బాబు ఎందుకు లాగుతున్నారో అని అన్నారు.
ఎన్టీఆర్ యే స్వయంగా చంద్రబాబు ను జామాత దశమ గ్రహం అని విమర్శించారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కింది చంద్రబాబే. వానలు కొడితే వాతలు పోవు. చంద్రబాబు పాత చరిత్రను మరిచి పోరని అయన అన్నారు. ఏపీ లో కెసిఆర్ కు వ్యక్తమైన ఆదరణ ను చూసి చంద్రబాబు ఓర్చు కోలేక పోతున్నారు. కెసిఆర్ పాలనను చూసి విజయవాడ లో కూడా ఆయన నిలువెత్తు విగ్రహం పెట్టాలనుకుంటున్నారు. కెసిఆర్ ను దేవుడిలా కొలిచే ప్రజలు తెలంగాణ లో ఉన్నారు. కెసిఆర్ ధాటికి మహామహులే మట్టి కరిచారు. చంద్రబాబు తన పద్దతిని మార్చుకోవాలి. కనైనా బీసీ లపై విపక్షాలు కుహనా రాజకీయాలు మానాలని అయన అన్నారు.
Tags:BCCI should give 24 per cent seats – Supreme Court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *