జంతరమంతర్ ప్రాంగణంలో బి.సిల ధర్నా

ఢిల్లీ ముచ్చట్లు:

ఢిల్లీ నందు జంతరమంతర్ ప్రాంగణంలో జాతీయ బి.సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్య సభ సభ్యులు ఆర్ .కృష్ణయ్య  అద్వర్యం లో బి.సిల ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులైన   మోపిదేవి వెంకటరమణ ,   బీద మస్తాన్ రావు  విచ్చేసారు.ఈ కార్యక్రమానికి జాతీయ బి.సి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ,షెఫర్డ్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ,కురుమ,కురువ సంఘం (రి.నెం:13/2017) అధ్యక్షులు  జబ్బల శ్రీనివాసులు  ఈ బి.సి ధర్నాకు హాజరుఅయ్యారు.అనంతరం జబ్బల శ్రీనివాసులు  ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.యెస్ జగన్మోహన్ రెడ్డి  బి.సిలకు తగిన న్యాయం చేశారు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 మంది రాజ్యసభ సభ్యులను,6 మంది M.P లను ,10 మంది మంత్రులను ,స్పీకర్ మరియు 56 కుల కార్పొరేషన్లు ,55 % రాజకీయ నామినేటెడ్ పదవులను ఇచ్చి బి.సి కులాల అభ్యునతికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి  వై.యెస్ జగన్మోహన్ రెడ్డి కి జాతీయ బి.సి సంక్షేమ సంఘం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు…అదే తరహా లో యావత్ భారత దేశంలోను బి.సి సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము.అలాగే చట్టసభలలో బి.సిలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, జన గణనలో బి.సి కుల జన గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని తెలియచేసారు. ఈ డిమాండ్లను సాధించేవరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలియచేసారు.

 

Tags: BC’s Dharna at Jantaramantar premises

Leave A Reply

Your email address will not be published.