సమస్యాత్మక గ్రామాల పట్ల అప్రమత్తంగా ఉండండి

Be alert to troubled villages

Be alert to troubled villages

-ఫ్యాక్సన్ జోలికెళ్లకుండా ప్రజల్ని చైతన్యం చేయండి
-జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్
Date:16/11/2018
అనంతపురంముచ్చట్లు:
సమస్యాత్మక గ్రామాల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని… ఫ్యాక్సన్ జోలికెళ్లకుండా ప్రజల్ని చైతన్యం చేయాలని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.  గత పక్షం రోజుల్లో  పోలీసులు సమస్యాత్మక గ్రామాల్లో తీసుకున్న చర్యలను ఆయన సంబంధిత విభాగపు అధికారులతో సమీక్షించి ఆ గణాంకాలను శుక్రవారం విడుదల చేశారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా వేయాలన్నారు. చిన్న చిన్న సమస్యలను సైతం ఇతర ప్రభుత్వ విభాగాలుతో కలసి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ సమస్యలు సున్నితమైనవి అయితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యలు జోలికెళితే అన్నివిధాలా నష్టపోయే ప్రమాదముందనే విషయాలుపై గ్రామీణుల్లో చైతన్యం చేయాలన్నారు. భౌతికంగా, మానసికంగా, ఆర్థికంగా చితికిపోయి కుటుంబాలు ఎలా చిన్నాభిన్నమవుతాయో గ్రామ సభల సందర్భంగా మహిళలకు వివరించాలన్నారు. కక్షలు… వాటి పర్యవసనాలుపై ఆయా కుటుంభీకుల్లో అవగాహన చేయాలన్నారు. ఇదే సమయంలో సమస్యాత్మక గ్రామాలపై పూర్తీ పట్టు కల్గి ఉండాలన్నారు. చిన్న చిన్న కారణాలుతోమొదలైన సమస్య జటిలమై తీవ్ర రూపం దాల్చే అవకాశముంటుందన్నారు. ఎలాంటి సమస్యనైనా నిర్లక్ష్యం చేయకుండా ఆదిలోనే తుడచి పెట్టాలన్నారు. ఇతర ప్రభుత్వ విభాగాల సహకారం తీసుకోవాలన్నారు. గ్రామాల సందర్శనలు, వాహనాల తనిఖీలు, కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు ప్రణాళికాబద్ధంగా నిర్ధేశిత సమయాల్లో నిర్వహించాలన్నారు. గ్రామాలకు వెళ్లినప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఇరు వర్గాలుతో మాట్లాడాలన్నారు. గ్రామాల్లోని తాజా పరిస్థితులను పసి గట్టాలన్నారు. వీటితోపాటు రోడ్డు భద్రత, మహిళా చట్టాలుపై గ్రామీణుల్లో అవగాహన చేయాలన్నారు. జిల్లాలో గత పక్షం రోజుల్లో 64 కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, 96 పల్లె నిద్రలు, సమస్యాత్మక గ్రామాల్లో 612 సందర్శనలు, 158 ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు, మహిళా పోలీసు వలంటీర్లతో కలసి 96 గ్రామ సభలు, 878 విజుబుల్ పోలీసింగ్ కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
Tags:Be alert to troubled villages

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *