మానసిక వికలాంగులను ఆదరించాలి

– న్యాయమూర్తి రమణారెడ్డి పిలుపు

Date:11/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

సమాజంలో వివిధ కారణాలతో మానసిక వికలాంగులుగా ఉన్న వారిని ఆదరించాలని పుంగనూరు అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి రమణారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కోర్టు సమావేశ మందిరంలో ఆయన న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు రెడ్డెప్ప, కార్యదర్శి మల్లికార్జునరెడ్డితో కలసి న్యాయవిజ్ఞాన సదస్సులో భాగంగా మానసిక వికలాంగులు, ఆరోగ్యం దినోత్సవంపై సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రమణారెడ్డి మాట్లాడుతూ మానసిక వికలాంగులు ఎలాంటి వివక్షతకు గురికాకుండ వారిని ఆదరించాలన్నారు. మానసిక వికలాంగులు ఎక్కడ ఉన్నా వారిని తీసుకొచ్చి సురక్షిత కేంద్రాలలో పెట్టాలన్నారు. ప్రతి ఒక్కరు ఈ విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు. అలాగే రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు లీగల్‌సర్వీసస్‌లను కోర్టులో ఏర్పాటు చేసి, దీని ద్వారా పేద ప్రజలకు న్యాయం అందిస్తున్నామన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కరించుకునేందుకు వీలుకాక న్యాయవాదులను నియమించుకోలేని పరిస్థితులలో కక్షిదారులకు లీగల్‌ఎయిడ్‌ ద్వారా న్యాయవాదులను నియమించి , వారి కేసులను విచారణ చేపడుతామన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు చట్టం, న్యాయం పట్ల అవగాహన కల్పించేందుకు న్యాయవిజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేసి, గ్రామాల వారిగా ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. కేసులను సత్వరం పరిష్కరించేందుకు కోర్టు ఆవరణంలో లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. లోక్‌అదాలత్‌లో పరిష్కారమైయ్యే కేసులపై అపీలు ఉండదని తెలిపారు. లోక్‌అదాలత్‌ తీర్పు తుది తీర్పు అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రామచంద్ర, గురుమూర్తి, శ్రీరాములురెడ్డి, విజయకుమార్‌, బాలాజికుమార్‌, వినోద్‌కుమార్‌, ప్రశాంతి, ఆనంద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అంతా విచిత్రం (కృష్ణాజిల్లా)

Tags:Be aware of mental disabilities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *