Natyam ad

అక్కడ పులులు ఉన్నాయి జాగ్రత

కర్నూలు ముచ్చట్లు:

 

శ్రీశైలం సాగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పులుల జాడను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులులకు సంబంధించిన అడుగులను గుర్తించిన అధికారులు వాటిని పరీక్షించి నిర్దారించారు.
అవును పులులు తిరుగుతున్నాయి..శ్రీశైలం, సాగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పులుల జాడను అటవీ శాఖ అధికారులు నిర్దారించారు. లభించిన పగ్ మార్క్స్ ను ఆధారంగా చేసుకొని ఒక ఆడ పులి, రెండు పులి పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. వెల్దుర్తి మండలంలోయపల్లి ఫారెస్ట్ లో పులులకు సంబంధించిన కీలకమైన పగ్ మార్క్స్ గుర్తింపుతో స్థానికులలో భయాందోళన వ్యక్తం అవుతోంది. అయితే భయపడాల్సిన  అవసరం లేదని అటవీ అధికారులు చెబుతున్నారు. లభించిన ఆధారాలు మేరకు జనవాసాలకు దూరంగా డీప్ ఫారెస్ట్ లో పులులు సంచరిస్తున్నాయని తెలిపారు. ఇంకా ఆవాసం ఏర్పాటు చేసుకోకపోవడంతో అడవిలో స్థిరనివాసం కోసం పులులు సంచరిస్తూ ఉన్నాయని అంటున్నారు. పల్నాడు రిజర్వ్ ఫారెస్ట్, సాగర్ శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ మధ్య సంచరిస్తున్నట్లుగా అధికారులు  భావిస్తున్నారు. జనావాసాలకు దూరంగా అడవిలో  పులులు  సంచరిస్తున్నాయని డిఎఫ్ఓ రామచంద్రరావు వెల్లడించారు.

 

 

టెక్నాలజీతోనే పులుల జాడ గుర్తింపు..
పల్నాడు అటవీ ప్రాంతంలో పులి సంచారాన్ని గుర్తించేందుకు ఫారెస్ట్ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు  చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భయపడ వలసిన అవసరం లేదని తెలియచేస్తున్నారు. పులులు సమీప గ్రామలలోకి రావని తెలిపారు. అయితే అధునాతన సాంకేతికతను ఉపయోగించి పులులకు సంబంధించిన జాడను కనుగొనేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలుసాగిస్తున్నారు. దీంతో అధికారులు ఏప్పటికప్పుడు అలర్ట్ అయి పులుల సంచారంపై నిఘా పెట్టారు. ఇప్పటివరకు పులుల సంచారంపై అంతగా అనుమానాలు లేవు. అయితే తాజాగా లభించిన ఆనవాళ్లతో అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.

 

 

ట్రాప్ కెమెరాలు ఏర్పాటు…
దుర్గి మండలం గజాపురం అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు. గత నెల 21వ తేదీని గజాపురం వద్దే ఆవుపై పులులు దాడి చేశాయి. కాకిరాల బీట్ లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసారు. ‌పులులు నీటి తావుల వద్దకు వచ్చే అవకాశం ఉండటంతో అక్కడ ట్రాప్ కెమెరాలను పెట్టామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.ట్రాప్ కెమేరాల్లో ఇప్పటి వరకు భౌతికంగా పులులకు సంబంధించిన జాడలు లభ్యంకాలేదు.

 

 

టైగర్ టెన్షన్…
పల్నాడు జిల్లా దుర్గి మండలం గజాపురం సమీపంలోని అటవీ  ప్రాంతంలో పులులు ఆవుపై  దాడి చేసి‌ చంపి వేసిన ఘటన వెలుగులోకి వచ్చిననాటి నుండి టైగర్ టెన్షన్ మొదలైది. వినుకొండ, మాచర్ల‌ రేంజ్ ఫారెస్ట్ పరిధిలో  ఉన్న మూడు మండలల‌ పరిధిలోని 24 గ్రామాలలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులులు తమ గ్రామాలపై పడి బీభత్స చేస్తాయో అన్న టెన్షన్ గ్రామస్థులను వెంటాడు తోంది. ఈ గ్రామలలో ప్రజలు ప్రధానంగా పశు పోషనపై ఆధార పడతారు. ఆవులను, గొర్రెలను మేపేందుకు అడవులలోకి వెళుతుంటారు. గజాపురం లో పులి దాడి ఘటనతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. ఆవుపై పులి దాడి చేసిన నాటి నుంచి పశువులను తండా వాసులు అడవిలోకి తీసుకు వెళ్ళడం లేదు. ఎప్పుడు పులులు గ్రామంపై దాడి చేస్తాయోనని బిక్కబిక్కు మంటున్నారు.

 

 

సర్వసిద్ధమైన ఫారెస్ట్ అధికారులు
ఫారెస్ట్ అధికారులు ఈ విషయాన్ని చాలా‌‌ సీరియస్ గా తీసుకున్నారు. ఆవును చంపిన తర్వాత పులి జాడా ఎక్కడా నమోదు కాకకావడంతో, అధికారులు సైతం తలలు పట్టుకున్నారు. అయితే ఇప్పుడు పాదముద్రలు లభించటంతో  మరింత అప్రమత్తం అయ్యారు. నాగార్జున సాగర్ రిజర్వు ఫారెస్ట్ నుంచి ఇతర పులల నుంచి విడిపోయన రెండు సంవత్సరాల వయస్సు ఉన్న పులి‌ పిల్లలు గా భావిస్తున్నారు. కండ్రిక, కాకిరాల, కనుమల‌ చెరువు, అడిగొప్పల  బీట్ ను అప్రమత్తం చేశారు.

 

Tags: Be careful there are tigers