డ్రైవింగ్‌లో జాగ్రత్తలు పాటించండి -ఎంవిఐ రవీంద్రనాయక్
పుంగనూరు ముచ్చట్లు:
వాహనాలను నడిపే సమయంలో డ్రైవర్లు అందరు రహదారి సూచనలు, జాగ్రత్తలు పాటించి, వాహనాలను నడపాలని పట్టణ ఎంవిఐ రవీంద్రనాయక్ సూచించారు. శుక్రవారం ఆర్టీసి డిపోలో రహదారి భద్రతా వారోత్సవాలను డీఎం సుధాకరయ్య, వైఎస్సార్ ఆర్టీసి మజ్ధూర్ అధ్యక్షుడు జయరామిరెడ్డితో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవిఐ మాట్లాడుతూ బస్సులను నడిపే సమయంలో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అలాగే సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలను నడపడం, అతివేగంగా వాహనాలను నడపడంతో ప్రమాదాలు జరుగుతుందన్నారు. డ్రైవర్లు ఏకగ్రతతో వాహనాలను నడపాలన్నారు. ప్రమాదాలను నివారించేందుకు రహదారి భద్రతలను పాటించాలని , ఈ విషయం పట్ల ఆర్టీసి డ్రైవర్లు తమ సహచర డ్రైవర్లకు చైతన్యం కలిగించాలని కోరారు. ప్రమాదాలను నివారించేందుకు మితిమీరినవేగం తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ స్పీరిచువల్ సోసైటి మాస్టర్ శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ సంధ్య, గ్యారేజ్ సూపరింటెండెంట్ రాధాకృష్ణ, ఆర్టీసి కార్మిక సంఘ నాయకులు కరీముల్లా, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags; Be careful while driving -MVI Ravindranayake
