ఆ టీచర్లను రెన్యూవల్ చేయాలి

హైదరాబాద్ ముచ్చట్లు:

 

మోడల్ స్కూల్ లలో పనిచేస్తున్న హావర్ బేస్డ్ టీచర్లను ఈ విద్యా సంవత్సరానికి రెన్యువల్ చేయాలని, గత ఏడు నెలలుగా పెండింగులో ఉన్న జీతాలు చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య  డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ హావర్ బేస్డ్ టీచర్లు తెలంగాణ పాఠశాల విద్య కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో, 17 మోడల్ స్కూల్ లల్లో ఒక్క రెగ్యులర్ టీచర్ లేకుండా కేవలం హవర్ బేస్డ్ టీచర్ల తోనే పాఠశాలలో నడుస్తున్నాయని అన్నారు. వారిని ఈ విద్యాసంవత్సరం రెన్యువల్ చేసి 7నెలలుగా చెల్లించని జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుంటే….

 

 

 

ఆదర్శ పాఠశాలల్లో పని చేస్తున్న ఈ టీచర్లను రెన్యువల్ చేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని హవర్ బేస్డ్ టీచర్లు, గెస్ట్ టీచర్లు, కాంట్రాక్టు టీచర్లు, విద్యా వాలంటీర్లు ఇలా రకరకాల పేర్లతో పిలువకుండా కాంట్రాక్టు టీచర్లు గా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా గంటకు 140 రూపాయల వేతనం ఇచ్చే దుస్థితి ఉండటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ఎక్స్పీరియన్స్ ను పరిగణలోకి తీసుకొని వివిధ స్థాయిల్లో పని చేస్తున్న టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని ఆయన కోరారు. అవర్ బేస్డ్ టీచర్ల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయనున్నామని హెచ్చరించారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Those teachers need to be renewed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *