అప్ర‌మ‌త్తంగా ఉండండి

-మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి… సీఎం కేసీఆర్ ఫోన్
-ఉమ్మ‌డి జిల్లాలో వ‌ర‌ద పరిస్థితిపై ఆరా

ఆదిలాబాద్ ముచ్చట్లు:


ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల వ‌ల్ల ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్ట్ లు, చెరువులు, కుంట‌ల్లో ప‌రిస్థితిపై సీయం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీయం… ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని,  వర‌ద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా  చర్యలు తీసుకోవాలన్నారు. మ‌రో 24 గంట‌ల పాటు  అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. హెలీపాడ్ ల‌ను సిద్ధంగా ఉంచాలన్నారు.

 

Tags: Be unapologetic

Leave A Reply

Your email address will not be published.