శ్రీశైలం ఘాట్ రోడ్డులో  ఎలుగుబంటి, పెద్దపులి హల్ చల్

శ్రీశైలం ముచ్చట్లు:

 

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఎలుగుబంట్లు పెద్దపులు హల్ చల్ చేస్తున్నాయి  శ్రీశైలానికి 5 కిలోమీటర్ల దూరంలోని ముఖద్వారం సమీపంలో ఎలుగుబంటి రోడ్డుపైకి వచ్చింది కొంతసేపు అటూ ఇటూ తిరుగుతూ హల్ చల్ చేసింది. మరోపక్క శ్రీశైలం నుంచి హైద్రాబాద్ వెళ్లె ఘాట్ రోడ్డ్ లోని శ్రీశైలానికి 30 కిలోమీటర్ల దూరంలోని వటవర్లపల్లి సమీపంలో పెద్దపులి రోడ్డుపై భక్తులకు కనిపించింది భక్తులు కొంతసేపు భయాందోళనకు గురైన రియల్ గా పెద్దపులి కనిపించడంతో కార్లలో నుంచి వీడియోలు తీసుకుని ఆనందపడ్డారు. అరుదుగా కనపడే అడవి జంతువులు పెద్దపులి ఎలుగుబంటిని చూసిన భక్తులు ఆచ్చర్యానికి లోనయ్యారు  రియల్ గా ఎలుగుబంటి పెద్దపులిని చూసి ఆనందపడ్డారు. శ్రీశైలం పరిధిలో గత నెల రోజులుగా  144 సెక్షన్ కర్ఫ్యూ అమలులో ఉండటంతో భక్తులు యాత్రికులు శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రయాణాలు తగ్గించేశారు దీనితో వాహనాలు రాకపోకలు నిలిచిపోవడంతొ ఘాట్ రోడ్ నందు అడవులు నిశబ్దంగ మారాయి  ఎలుగుబంటిని పెద్దపులిని చూసిన భక్తులు అచ్చర్యానికి గురైయ్యారు ఎలుగుబంటిని చూస్తూ వీడియోలు తీశారు శ్రీశైలం అడవులు రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో చిరుతపులులు ఎలుగుబంట్లు పెద్దపులులు రోడ్లపై కనిపిస్తున్నాయి అటూ కర్నూలు గుంటూరు నుంచి వచ్చే భక్తులు, ఇటూ హైద్రాబాద్ నుంచి ఘాట్ రోడ్ లో శ్రీశైలం వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Bear and tiger on the Srisailam Ghat Road

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *