ఏలుగుబంట్ల హల్ చల్

కర్నూలు ముచ్చట్లు:
 
జిల్లా శ్రీశైల మండలంలో పలు ప్రాంతాల్లో ఎలుగుబంట్లు సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. గత మూడు రోజులుగా సున్నిపెంట దోమలపెంట ప్రాంతాల్లో ఎలుగులు సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి ఎలుగుల సంచారంతో స్థానికులు ఇళ్ల నుండి బయటకు రావాలంటే భయాందోళన చెందుతున్నారు. సున్నిపెంట గ్రామంలో పూర్ణానంద ఆశ్రమం, బండ్లబజార్ ప్రాంతాలలో మూడు రోజుల నుంచి ఎలుగుబంట్ల హల్ చల్ చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఎలుగుబంట్లను గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సున్నిపెంట చేరుకున్న అటవీశాఖ సిబ్బంది గ్రామం నుంచి ఎలుగుబంట్లను తరిమేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Bear hull hull

Natyam ad