Natyam ad

క్రషర్  బ్లాస్టింగ్ తో ఇళ్లకు బీటలు

మహబూబాబాద్ ముచ్చట్లు:

మహబూబాబాద్ జిల్లా పొనుగోడు లోని స్టోన్స్ క్రస్సర్ లో అర్ధరాత్రి బాంబు బ్లాస్టింగ్ కావడం కలకలం రేపింది. గూడూరు మండలం పొనుగోడు గ్రామ శివారు లోని రేణుక స్టోన్స్ క్రస్సర్ లో ఉద్రీక్తత నెలకొంది. తమ గ్రామానికి ప్రమాదం జరుగుతుందని రేణుక క్రస్సర్ యాజమాన్యాన్ని  గాజులగట్టు గ్రామస్తులు అడ్డగించారు. బాంబు పేలుళ్ళకు భయంతో ఇళ్ల లో నుంచి రోడ్లపైకి పరుగులు తీసారు.
భారీ పెలుళ్ళకు ఇల్ల గోడలకు బీటలు, నెర్రలు పడ్డాయి. భారీ బండారాళ్లకు పెద్ద పెద్ద రంద్రాలతో  ప్రధాన రహదారులు  నాశనమయ్యాయి. మిర్చి పత్తి మొక్కజొన్న పంట పొలాలలో భారీ బండారాళ్ళు ఎగిరి పడడంతో భారీ పంట నష్టం వాటిల్లింది.
నెక్కొండ రహదారి పక్కనే క్రషర్ ఉన్న పేలుళ్ళు చోటుచేసుకోవడం తో భయం భయం తో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. బ్లాస్టింగ్తో దూలి దుమ్ముతో గాజులగట్టు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం  రాత్రి క్రషర్ వద్ద గ్రామస్తులు  ఆందోళనకు దిగారు. పేలుడు కారణంగా దాదాపు 25 ఇళ్లకు బీటలువారాయి

Post Midle

Tags: Beating houses with crusher blasting

Post Midle