పెన్షనర్లకు అందని బెనిఫిట్స్.      

Date:24/09/2020

-జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్

జగిత్యాల ముచ్చట్లు

రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక,పెన్షన్ మంజూరు కాక రాష్ట్రంలో 6 మాసాల నుంచి రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ,అధికారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగిత్యాల జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.గురువారం జిల్లా సంఘ భవన్ లో ఆయన మాట్లాడారు. రిటైర్ అయిన రోజే  బెనిఫిట్స్ ఇవ్వాలని సీ ఏం కేసీఆర్ 2016 డిసెంబర్ 24 న ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఉన్నతాధికారులు అమలు చేయక పోవడం శోచనీయమన్నారు. మొదటి ఆరు నెలల ముందే బెనిఫిట్స్ ఫైల్ రెడీ చేయాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొందన్నారు. ఈ మేరకు తమ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించామన్నారు.  ఈ నెల 14 న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పదవీ విరమణ రోజే అన్ని బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.లాక్ డౌన్ కాలంలో తగ్గించి ఇచ్చిన పెన్షన్ డబ్బులు పెన్షనర్స్ కు చెల్లించాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం,పబ్బా శివానందం, రగుపతి, విద్యాసాగర్, ప్రకాష్,గుడ్ల గంగాధర్,సైఫాద్దీన్, యాకూబ్,కరుణ, విజయ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

హిందువుల మనోభావాలు కు భంగం కలిగిస సహించేది లేదు

Tags:Beautiful benefits for pensioners.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *