పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ముని పిఎల్‌ఆర్ బైపాస్ రోడ్డు గల తాటిమాకులపాళెం వద్ద శ్రీకళ్యాణ వెంకటెశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ఆర్చిని సుందరంగా ఏర్పాటు చేస్తున్నారు. స్వామివార్ల బొమ్మలతో సుమారు 20 అడుగుల ఎత్తులో ఆర్చిని నిర్మించి, రంగులు వేసే కార్యక్రమం చేపట్టారు. కాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఆలయాన్ని టీటీడీలోనికి విలీనం చేయించారు. అప్పటి నుంచి టీటీడీ ఆధ్వర్యంలో పూజలు, కైంకర్యాలు , ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆర్చి నిర్మాణంతో పట్టణంలో నూతన శోభ సంతరించుకుంది.
Tags; Beautiful Venkanna Mukhadwara in Punganur