Natyam ad

బాల్కనీలో బెగోనియా మొక్కల పెంపకంతో ఇంటికి శోభ..!      

అమరావతి ముచ్చట్లు:

 

బాల్కనీలో, డాబాపైన పూల మొక్కల పెంపకంతో ఇంటికి కొత్త శోభ వస్తుంది. అలంకరణ మొక్కలు, పూల మొక్కలు ప్రస్తుతం ఎన్నో మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిలో బెగోనియా పూల మొక్క చాలా అందాన్నిస్తుంది. ఈ మొక్కలు సాధారణంగా ఒక అడుగు కంటే తక్కువ ఎత్తులో ఉండి 4 అంగుళాల మేర వెడల్పుతో రంగురంగుల పువ్వులను ఉత్పత్తి చేస్తాయి. తెలుగు, ఎరుపు, గులాబీ, పసుపు, నారింజ రంగుల్లో పువ్వులను అందిస్తాయి. ఇంటిలోపల కంటైనర్లలో కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్కలు ఎక్కువగా నీడ పట్టున పెరుగుతాయి. విండో బాక్సుల్లో, బాల్కనీలో కుండీల్లోగానీ పెంచుకోవచ్చు. బెగోనియా మొక్కలు ఏకరీతిగా ఉంటాయి. విత్తనాల నుంచి సులభంగా మొలకెత్తుతాయి.

 

 

 

ఆకులు, కాండం నుంచి కూడా వ్యాప్తి చెందుతుంది. వాక్స్‌ బెగోనియా, ట్యూబరస్‌ బెగోనియా, కేన్‌ బెగోనియా, రైజోమాటస్‌ బెగోనియా, రెక్స్‌ బెగోనియా వంటి రకాలు ప్రస్తుతం విరివిగా దొరుకుతున్నాయి.
వాతావరణం: బెగోనియా మొక్కలు పెరగడానికి తేమ, వెచ్చని వాతావరణం అవసరం. బెగోనియా మొక్కలు 16-25 డిగ్రీల ఉష్ణోగ్రతను ఇష్టపడతాయి. వేసవిలో కుండీల్లో పెంచడం చాలా మంచిది. సూర్యకిరణాలు నేరుగా పడకుండా చూసుకోవాలి. మంచు ప్రమాదం దాటిన తర్వాత వీటిని పెంచుకునేందుకు ఉపక్రమించాలి. వీటి పెరుగుదలకు పాక్షిక నీడ అవసరం.
వ్యాప్తి చేయడం..: బెగోనియా మొక్కలను ఆకుల ద్వారా, కాండం ద్వారా వ్యాప్తి చేయడం సులభమైన పద్ధతి. ఇందుకోసం ఆరోగ్యవంతమైన ఆకులు, కాండాన్ని ఎంచుకోవాలి. ఆకు పరిణామాన్ని బట్టి అనేక కటింగ్‌లను పొందవచ్చు. కటింగ్‌ ఆకుల నుంచి ఎనిమిది వారాల్లో కొత్త మొక్కలు వృద్ది చెందుతాయి.

 

 

Post Midle

కాండం కట్‌ చేస్తే.. కట్‌ చేసి నీటి గ్లాసులో ఉంచాలి. కాండం అడుగు భాగం గుండా వేర్లు పెరిగేంత వరకు వేచి ఉండాలి. అనంతరం కుండీల్లోకి మార్చాలి. దుంపల నుంచి వ్యాప్తి చేయడానికి బాల్కనీ, వేలాడే బుట్టలు, కంటైనర్లలో నాటుకోవచ్చు. ఒక రైజోమ్‌ను దాదాపు ఒకటిన్నర అంగుళం పొడవు మేర కత్తిరించి నాటుకోవాలి. బెగోనియా మొక్క విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి. వీటిని హ్యాండిల్‌ చేయడం చాలా కష్టం. మొక్కలకు ఫంగస్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున విత్తనాలు నాటేందుకు ప్రతీసారి కొత్త ట్రేలను వినియోగించాలి. విత్తనాలు నాటేందుకు స్టెరైల్‌ మట్టిని వాడాలి. విత్తనాలు వేసిన తర్వాత ప్లాస్టిక్‌ కవర్‌తో కప్పి రోజుకు దాదాపు 14-18 గంటలు లైట్ల కింద ఉండేలా చూడాలి. కొన్ని రకాల బెగోనాయా మొక్కలు మొలకెత్తేందుకు వారాల సమయం పడుతుంది. అవసరమైనప్పుడల్లా స్ప్రే బాటిల్‌తో నీరు అందించాలి. మొక్క మొలకెత్తిన తర్వాత ట్రే నుంచి కుండీల్లోకి మార్చాలి.

 

 

 

నీటి యాజమాన్యం: బెగోనియా మొక్కల పెంపకానికి కుండీల్లో అన్ని వేళలా కొద్దిగా తేమ ఉండేలా చూసుకోవాలి. ఇదేసమయంలో చాలా తడిగా కూడా ఉండకూడదు. అధికంగా నీరు ఇవ్వడం వల్ల ఈ మొక్కలు త్వరగా కుళ్లిపోతాయి. నీరు పెట్టేందుకు ముందు కుండీల్లో మట్టిని పరీక్షించాలి. అంగుళం లోతు వరకు మట్టి పొడిగా ఉండటం శ్రేయస్కరం. బాల్కనీలు, వంటగది, బాత్రూమ్‌లలో తేమ ఎక్కువగా ఉండి ఈ మొక్కలు పెరిగేందుకు దోహదపడతాయి.
ఆశించే తెగుళ్లు: బెగోనియా మొక్కలను ఎక్కువగా ఫంగస్‌ వ్యాధి ఆశిస్తుంది. ముఖ్యంగా పౌడర్లీ మిల్డో ఆకుల దిగువ వైపున బూడిద లేదా తెలుపు పూతను వదిలివేస్తుంది. చివరకు మొక్క ఎండిపోయి చనిపోతుంది. దీని నుంచి మొక్కను రక్షించుకునేందుకు ప్రతి రోజు ఉదయం మొక్క చుట్టూ ఉన్న మట్టిని పరిశీలించాలి. స్టెరిలైజ్‌ చేసిన కత్తెరలను వాడాలి. స్లగ్స్‌, నత్తలు, గొంగళిపురుగులు కూడా ఆశిస్తుంటాయి. వీటి నుంచి మొక్కలను కాపాడేందుకు సబ్బు నీటిని పిచికారి చేయాలి.

 

Tags: Beautify your home with begonia plants on the balcony..!

Post Midle

Leave A Reply

Your email address will not be published.