పాపం పండిందంటూ…భగవద్గీత ప్రస్తావన

Because of the sin ... the mention of the Bhagavad Gita

Because of the sin ... the mention of the Bhagavad Gita

Date:06/12/2019

విజయవాడ ముచ్చట్లు:

హైదరాబాద్ శివారులో సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్‌ దిశ హత్యకేసులో నిందితులు ఎన్‌కౌంటర్ అయిన సంగతి తెలిసిందే. శంషాబాద్ సమీపంలో చటాన్ పల్లి దగ్గర నలుగుర్ని కాల్చి చంపారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు కాల్పులు జరిపారు.. నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనపై పలువురు సోషల్ మీడియా‌లో స్పందిస్తున్నారు.. తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ట్విట్టర్‌లో స్పందించారు. ‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అంటూ భగవద్గీతలోని శ్లోకాన్ని ప్రస్తావించారు. ‘సజ్జనుల సంరక్షణార్థమూ, దుష్టజన శిక్షణకూ, ధర్మసంస్థాపన కోసం.. ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే వుంటాను’అంటూ శ్రీకృష్ణుడు ఈ శ్లోకాన్ని చెప్పారు. పాపాలు పెరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు.. ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలో దేవుడు అవతరిస్తాడు అంటారు.ఇటు సోషల్ మీడియాలోనూ ఈ ఘటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిందితులకు సరైన శిక్ష పడిందంటూ ట్వీట్లు, పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. తెలంగాణ పోలీసులు, సీపీ సజ్జనార్‌ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఘటన జరిగిన తర్వాత పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడిన వారే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే పోలీసులు మంచి పనిచేశారంటూ ఎన్‌కౌంటర్‌పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

నా కూతురుని హత్యాచారం చేసిన వారి సంగతేంటీ

 

Tags:Because of the sin … the mention of the Bhagavad Gita

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *