అక్షరాస్యులుగా మారి చట్టాలను అవగాహన చేసుకోవాలి

Become literate and educate the laws

– న్యాయమూర్తి రమణారెడ్డి

Date:25/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఒక్కరు అక్షరాస్యులుగా మారి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పుంగనూరు క్రిమినల్‌ కోర్టు న్యాయమూర్తి రమణారెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం మండలంలోని నల్లగుట్లపల్లెతాండలో అంతర్జాతీయ బాలుర అదృశ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రమణారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు తమ దైనందిన జీవితంలో ఎదురైయ్యే సమస్యలకు సంబంధించిన చట్టాలను తెలుసుకుని , చైతన్యవంతులు కావాలన్నారు. ముఖ్యంగా టీవిలలో వచ్చే సీరియల్‌ కథనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని, కానీ చట్టాలు, ఇతర విషయాలపై దృష్టి సారించడం లేదని తెలిపారు. చట్టంలో ఏ నేరం చేసిన తమకు తెలియదు అంటే తప్పించుకునేందుకు వీలులేదన్నారు. తెలిసినా, తెలియకపోయినా నేరానికి శిక్ష తప్పదన్నారు. చిన్నచిన్న సమస్యలు పెద్ద పెద్ద సమస్యలుగా మారుతుందన్నారు. ఉదాహరణకు ప్రాంసరీ నోట్లలో , ఖాళీ పేపర్లలో సంతకాలు చేయడం మంచిది కాదన్నారు. ఒక సారి సంతకం చేసిన తరువాత తప్పించుకునేందుకు వీలులేదన్నారు. ప్రతి ఒక్కరు ప్రాంసరీనోట్లు వ్రాసిన తరువాత వాస్తవమైతే సంతకం చేస్తే ఇరువర్గాలకు మేలు చేకూరుతుందన్నారు. ఇలాంటి విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే న్యాయవిజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేసి, ప్రతి శనివారం గ్రామీణ ప్రాంతాలలో పర్యటిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు పులిరామక్రిష్ణారెడ్డి, కార్యదర్శి కెవి.ఆనంద్‌కుమార్‌, లోక్‌ అదాలత్‌ మెంబర్‌ సుబ్రమణ్యం, వీఆర్‌వో, గ్రామస్తులు పాల్గొన్నారు.

 

ఉచిత కంటి వైద్యశిబిరం

 

Tags: Become literate and educate the laws

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *