Natyam ad

 స్మార్ట్ కొంటే బీర్ ఫ్రీ….

లక్నోముచ్చట్లు:

 

నియోగదారులను ఆకర్షించేందుకు కొందరు వ్యాపారులు వినూత్నమైన ఆఫర్లను ఇస్తుంటారు. ప్రచారం కొత్త పంథాను అనుసరిస్తుంటారు. ఇదే రీతిలో కస్టమర్ల కోసం ఓ వ్యాపారి వినూత్నమైన ఆఫర్ ప్రకటించాడు. తమ షాప్‍లో స్మార్ట్‌ఫోన్ కొంటే బీర్ ఉచితం అంటూ వెల్లడించాడు. దీంతో జనం ఎగబడ్డారు. ఉత్తరప్రదేశ్‍లోని భదోహిలో ఇది జరిగింది. ఫోన్‍ కొనుగోలుకు బీర్ ఫ్రీ అని ప్రకటించగానే ఆ షాప్‍కు జనాలు భారీగా వచ్చారు. దీంతో పోలీసులు ఆ షాపు యజమానిని అరెస్ట్ చేశారు. ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారంటూ ఆ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే రెండు బీర్ క్యాన్స్ ఉచితంగా ఇస్తామంటూ చౌరీ రోడ్‍లో మొబైల్ షాప్ నడుపుతున్న రాజేశ్ మౌర్య ప్రకటన ఇచ్చారని కోత్వాలీ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. “మార్చి 3వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ మధ్య ఆండ్రాయిడ్ ఫోన్ కొన్న వారికి రెండు బీర్ క్యాన్లు ఫ్రీగా ఇస్తామని పోస్టర్లు, పాంప్లెట్ల ద్వారా రాజేశ్ మౌర్య ప్రచారం చేశారు” అని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ కుమార్ వెల్లడించారు.

 

 

Post Midle

ఈ ఆఫర్ గురించిన సమాచారం ఎక్కువ మంది ప్రజలకు చేరింది. దీంతో ఒక్కసారిగా షాప్‍కు వచ్చారు జనాలు. భారీగా గుమికూడారు. అయితే ఈ ఆఫర్ ప్రకటించిన వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్ ఆదేశించటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు మొబైల్ షాపు వద్ద ప్రజలు భారీగా గుమికూడిన సమయంలో వ్యాపారి మౌర్యను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించినందుకు ఐపీసీ సెక్షన్ 151 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అలాగే షాప్‍ను సీజ్ చేసినట్టు వెల్లడించారు.

 

Tags:Beer free if you buy smart…

Post Midle