Natyam ad

హైదరాబాద్ నగరంలో బీర్లు కొరత

-ఆందోళన చెందుతున్న మందుబాబులు

హైదరాబాద్ ముచ్చట్లు:

Post Midle

అసలే హైదరాబాద్ నగరం లో ఎండలు మండిపోతు న్నాయి.అందులోనూ పార్లమెంట్ ఎన్నికల ఫీవర్ ఇక మందుబాబులు ఊరు కుంటారా? పొద్దంతా ప్రచారం చేసిన మనోళ్లు సాయంత్రానికి ఒక చల్లని బీర్ తాగి బిర్యానీ తిని ఎంచక్కా సేద తీరాలని అనుకుంటారు.కానీ హైదరాబాద్ నగరం లోని మందుబాబులకు ఆ కిక్ దొరకడం లేదట. నగర వ్యాప్తంగా ఎక్కడ బీర్లు దొరకని పరిస్థితి నెలకొందని మందుబాబులు బేజారు అవుతున్నారు.గత కొద్ది రోజులుగా రాష్ట్రం లో బీర్ల కొరత ఏర్పడింది. చాలినన్ని బీర్లు దొరక్క మద్యం ప్రియులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మామూలుగానే ఎండాకా లంలో బీర్లు ఎక్కువగా సేల్ అవుతుంటాయి.అందులోనూ ఇప్పుడు ఓ వైపు ఎండలు మండిపో తుంటే..మరోవైపు లోక్ సభ ఎన్నికలు మరింత హీటెక్కి స్తున్నాయి. అటు ఐపీఎల్ కూడా కొనసాగుతుండ డంతో మద్యం ప్రియులు బీరు తాగుతూ ఎంజాయ్ చేయాలనుకుంటారు.కానీ ఎక్కడా బీర్ దొరకని పరిస్థితి ఉందని మందుబా బులు బావూరు మంటున్నా రు. డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో బీర్ల కొరత ఏర్పడింది.

 

 

సమ్మర్ సీజన్ కావడంతో సాధారణంగా బీర్లు ఎక్కువ గా సేల్ అవుతుంటాయి. అయితే ఈసారి ఊహించి నదానికంటే ఎక్కువగా అమ్ముడవుతున్నాయని వైన్స్ షాప్‌ల యజమానులు చెబుతున్నారు.ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలోనే పెద్ద మొత్తంలో బీర్ల అమ్మకాలు సాగాయని, ఇప్పుడు ఎండలు మండి పోతుండడంతో మరింత డిమాండ్ పెరిగిందని వైన్ షాపు యజమానులు తెలిపారు.గత రెండు నెలల్లో సాగిన అమ్మకాలు ఈ ఒక్క నెల లోనే అమ్ముడు అయ్యేలా ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. అయినా వైన్స్‌లలో సరిపడా బీర్లు అందుబాటు లో ఉండడం లేదు. దీంతో నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెడుతు న్నారు.స్టాక్ వచ్చిన రెండు గంటల్లో నే బీర్లన్నీ అమ్ముడు అవు తున్నాయని, చాలా చోట్ల మద్యం ప్రియులు చల్లగా లేకపోయినా పర్వాలేదు బీరు ఉంటే చాలు ఇవ్వ మని తీసుకు వెళ్తున్నారంటే బీర్లకు ఎంత డిమాండ్ ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది.

 

Tags: Beers are scarce in Hyderabad city

Post Midle