Natyam ad

రైల్వే స్టేషన్ లో ప్రయాణికులపై తేనెటీగల దాడి

శ్రీకాకుళం ముచ్చట్లు:

శ్రీకాకుళం జిల్లామందస రైల్వే స్టేషన్ లో గురువారం సాయంత్రం  విశాఖపట్నం -భువనేశ్వర్ వెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్  కోసం ప్రయాణికులు వేచి యున్న క్రమంలో  తేనె టీగల గుంపు ప్రయాణీకుల పై ఒక్కసారి గా దాడి చేశాయి.టికెట్ తీసుకునిప్లాట్ పారం పై ఉన్న  ప్రయాణీకుల పై చెట్ల పైనున్న  తేనెటీగల గుంపు  మూకుమ్మడిగా  దాడి చేశాయి.తేనెటీగల సృష్టించిన బీభత్సంతో  ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు.40 మంది ప్రయా ణీకులను వెంబడించి మరీ దాడి చేశాయి.కొందరు ప్రయాణికులు స్టేషన్ వెలుపలికి పరుగులు తీయగా  తేనెటీగల బారిన పడి గాయాలు పాలైన ప్రయాణికులు ఇంటర్ సిటీ రైలు ఎక్కలేక‌ రైల్వే స్టేషన్లోనే ఉండిపోయారు.గాయపడిన బాధితులను స్థానికులు హరిపురం ప్రభు త్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.

 

Post Midle

Tags:Bees attack passengers in railway station

Post Midle