Natyam ad

ఆస్తి కోసం తల్లిదండ్రులకు ఎలుకల ముందు

తిరువనంతపురం  ముచ్చట్లు:


కేరళలో దారుణం జరిగింది. తన తల్లిదండ్రులు బతికుంటే తనకు ఆస్తి రాదని.. వాళ్లను చంపేస్తే వారి ఆస్తి తనకే వస్తుందన్న ఆశతో తల్లిదండ్రులనే హతమార్చాలని ప్లాన్ చేసి.. తల్లిని హత్య చేసిన ఘటన త్రిస్సూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. త్రిస్సూర్ జిల్లాలోని కున్నాంకులం ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన తల్లికి విషం ఇచ్చి హత్య చేసింది. ఉదయమే టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. రోజులాగే కుమార్తె ఇచ్చిన టీ తాగిన తల్లి కొద్దిసేపటికే స్పృహ తప్పి పడిపోయింది. ఆరోగ్యం క్షిణించింది. దీంతో ఈనెల 18వ తేదీన ఆసుపత్రిలో చేరింది. ఎన్ని పరీక్షలు చేయించినా కారణం తెలియలేదు. విషయం కలిపిన ఆహార పదార్థాలు తినడం వలనే ఆరోగ్యం క్షిణించి ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతుండగానే బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. బుధవారం పోస్టుమార్టం నిర్వహించగా.. మృతురాలి శరీరంలో ఎలుకల మందు ఆనవాళ్లు ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు మృతురాలి కుమార్తెను ప్రశ్నించగా.. ఆస్తి కోసం తానే తల్లిని హత్య చేయాలని నిర్ణయించుకుని.. టీలో ఎలుకలమందు కలిపినట్లు తెలిపింది.నిందితురాలికి విహహం అయ్యి.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో.. తన తల్లి, దండ్రులు చనిపోతే వారి ఆస్తి తనకొస్తే అప్పులు తీర్చుకోవచ్చనే ప్లాన్ తో తల్లిదండ్రులిద్దరిని చంపాలని నిర్ణయించుకుంది. అలాగే తన తండ్రికి కూడా ఎలుకల మందు కలిపిన టీ ఇచ్చింది. టీ కొద్దిగా రుచి మారిందని గ్రహించి పూర్తిగా టీ తాగలేదు. దీంతో ఆయనకు కూడా పరీక్షలు నిర్వహించగా.. శరీరంలో విషపదార్థాలు కనిపించలేదు. నిందితురాలిని పోలీసులు ప్రశ్నించగా.. తల్లిదండ్రులిద్దరిని చంపాలని ప్లాన్ చేశానని.. తల్లి మాత్రమే విషం కలిపిన టీ తీసుకుందని నిందితురాలు తెలిపింది. అసలు విషయం తెలియడంతో నిందితురాలైన మృతురాలి కుమార్తెను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.

 

Tags: Before the rats to the parents for the property

Post Midle
Post Midle