బీజేవైఎం నేతల భిక్షాటన

హైదరాబాద్  ముచ్చట్లు:

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు పై అవలంబిస్తున్న తీరుకు నిరసనగా చత్రినాక వద్ద బీజేవైఎం భాగ్యనగర్ జిల్లా   నేతలు శుక్రవారం నాడు  భిక్షాటన నిర్వహించారు. నీళ్లు, నిధులు, నియామకాలు కోసం కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న వాటి అమలులో మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని ఆరోపించారు. ఎంతోమంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకొని రాష్ట్రాన్ని సాధించుకుంటే వాటి సమాధుల పైన నేడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.  నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని  మాయమాటలు చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వెంటనే ఆ నిధులను విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకో వాలని లేదు అంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌలిపుర డివిజన్  కార్పోరేటర్  భాగ్యలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర బీజేవైఎం అడిషనల్ సెక్రటరీ రమణ్ సింగ్, దినేష్ గౌలికర్, ఈశ్వరి యాదవ్, ప్రమోద్ ముదిరాజ్, బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags; Begging of BJYM leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *