Natyam ad

జగిత్యాలలో బస్తీ దావఖాన ప్రారంభం

జగిత్యాల  ముచ్చట్లు:

జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపూరలో బస్తీ దవాఖాన ను శుక్రవారం జగిత్యాల  జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి, జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్  ,మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి ప్రవీణ్ లు ప్రారంభించారు.అనంతరం వార్డుకు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 35వేల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,అదనపు కలెక్టర్ అరుణ శ్రీ,ఆర్డీఓ మాధురీ,జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి పుప్పాల  శ్రీధర్,పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్,కౌన్సిలర్ లు అస్మా అంజూమ్ షకీల్, రజియుద్దీన్ కో ఆప్షన్ సభ్యులు రియాజ్ మామా,హానీస్ ఖుతేజ,
ఎఎంసీ వైస్ చైర్మన్ అసిఫ్,సెంట్రల్ ముస్లిం కమిటీ ఛైర్మెన్ బారీ, ఆటో యూనియన్ అధ్యక్షులు హాజీ,ఎంఐఎం పట్టణ అధ్యక్షులు నదీమ్,నాయకులు అమీణుల్ హసన్,జిలాని,కౌన్సిలర్లు,నాయకులు,ప్రజలు,మైనార్టీనాయకులు,తదితరులు
పాల్గొన్నారు.

ఆసుపత్రుల్లో పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్పర్సన్

Post Midle

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వ జనరల్ఆసుపత్రి ఎంసీ హెచ్ లో రోగులకు  జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ,మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్,అదనపు కలెక్టర్ అరుణ శ్రీ,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుప్పాల శ్రీధర్,సుపరింటెండెంట్ రాములతో కలిసి పండ్లు పంపిణీ చేశారు.
అలాగె జగిత్యాల పాత బస్టాండ్ లో గల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పండ్ల పంపిణి, బాలసదన్ లో స్వీట్, పండ్లు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,కమిషనర్ స్వరూప రాణి,రాష్ట్ర కౌన్సిలర్ ఫోరం ఉపా ద్యక్షులు బోడ్ల జగదీష్, డిఈ రాజేశ్వర్,కౌన్సిలర్ లు, నాయకులు,వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Beginning of Basti Davakhana in Jagitya

Post Midle