Bellamkonda Srinivas, Santhosh Srinivas as Emumanuel

బెల్లంకొండ శ్రీనివాస్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమాలో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్

Date:29/02/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

‘రాక్ష‌సుడు’ వంటి సూప‌ర్ హిట్ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న సినిమాని ‘కందిరీగ‌’, ‘ర‌భ‌స’, ‘హైప‌ర్‌’ చిత్రాల ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నారు.
సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా నభా నటేష్ నటిస్తుండగా, తాజాగా మరో నాయికగా అను ఇమ్మాన్యుయేల్
ఎంపికయ్యారు.

 

 

ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుతున్న షెడ్యూల్లో ఆమె జాయినయినయ్యారనీ, నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ చేస్తున్న పాత్రలు రెండింటికీ కథలో ప్రాధాన్యం ఉంటుందనీ చిత్ర
బృందం తెలిపింది. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డబోతున్నారు. అందుకోసం ఆయన 8-ప్యాక్స్‌ తో మేకోవ‌ర్ అవడం విశేషం.

 

 

‘అల్లుడు శీను’, ‘జ‌య‌జానకి నాయ‌క‌’ చిత్రాల త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌, దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్ర‌మిది. అనేక బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేసిన ప్రముఖ  సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

 

 

శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే ప్రకటించనున్నారు. వేసవి కానుకగా మే నేలలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత జి.సుబ్ర‌హ్మ‌ణ్యం సన్నాహాలు  చేస్తున్నారు.

వేడెక్కిన విశాఖ రాజకీయాలు

Tags: Bellamkonda Srinivas, Santhosh Srinivas as Emumanuel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *