రామసముద్రం ముచ్చట్లు :
వాలింటర్లు ద్వారా పింఛన్లు పంపిణికు ఎన్నికల అధికారులు బ్రేకులు వేయడంతో వృద్ధాప్య, వితంతు పింఛన్ లబ్ధిదారులు తమ సచివాలయాలకు పరుగులు తీశారు. గతంలో 1వ తేదీ వస్తే వాలింటర్లు తలుపులు తట్టి పింఛన్లు అందజేస్తుండడంతో ఎంతో మంది వృద్ధులు ఆరోగ్య చికిత్సలకు నగదును వినియోగించుకునే వారు. అయితే ప్రస్తుతం ఎన్నికల నియమావళి ప్రకారం వాలింటర్లు పింఛన్లు పంపిణీ చేయకూడదని పలువురు టీడీపీ సానుభూతి పరులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో వృద్ధులకు పింఛన్ ఆగచాట్లు తప్పులేదని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. రామసముద్రం మండలంలో గురువారం ఉదయం నుంచి పింఛన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభం కావడంతో వృద్ధాప్య, వితంతు పింఛన్ దారులు సచివాలయాలకు పరుగులు తీశారు.
ఇందులో భాగంగా కేసిపల్లి సచివాలయం వద్ద వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఎండను సైతం లెక్కచేయకుండా పింఛన్ పొందడానికి భారీగా తరలివచ్చారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సచివాలయ సిబ్బందిచే ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పింఛన్ అందించారు. లబ్ధిదారులు పింఛన్ పైకాన్ని అందుకుని సంతోషంగా ఇళ్లకు వెళ్లారు. ఇంటి వద్దకు రావలసిన పింఛన్ కోసం సచివాలయానికి వచ్చి రద్దీలో పడ్డ కష్టాలకు వాలంటీర్ల తొలగింపే కారణమని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వెళ్లారు. ఇప్పుడే ఇలా ఉంది రేపు పొరపాటున టీడీపీ అధికారంలోకి వస్తే ఇంకెన్ని బాధలు అనుభవించాలో అంటూ పలువురు వృద్ధాప్య, వితంతు పింఛన్ లబ్ధిదారులు వాపోయారు.
Tags; Beneficiaries rushed to Secretariat for pension