Natyam ad

అర్బన్ పోలీస్ సైబర్ వింగ్ కు బెస్ట్ నేషనల్ సైబర్ అవార్డు

సైబర్ అవార్డ్ సిబ్బంది శ్రమ వల్లే వచ్చింది. ఇది వారికే అంకితం
జిల్లా యస్.పి  వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్
 
తిరుపతి అర్బన్ ముచ్చట్లు:
 
నేషనల్ సైబర్ అవార్డు-2021 ఈ సందర్భంగా నిర్వహించిన సైబర్ పోలీసింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ మీట్-3.0 పోటీలను విచ్ ప్లాట్ ఫామ్ పై డిసెంబరు మూడు, నాలుగు, ఐదు తేదీలలో హైదరాబాద్ నందు నిర్వహించారు.ఈ సందర్భంగానే సైబర్ పోలీసు టీం కు కేసు పరిశోధనలో తగు సూచనలు ఇస్తూ , వారిని విజయవంతంగా పలు సైబర్ నేరాలను పరిష్కరించడంలో ముందుకు నడిపిన అర్బన్ యస్.పి  వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ కి బెస్ట్ సైబర్ క్రైమ్ టీం మెంటార్ అవార్డు లభించింది.ఈ పోటీలలో తిరుపతి అర్బన్ పోలీసు విభాగానికి చెందిన సైబర్ వింగ్ సి.ఐ వి.సుబ్రహ్మణ్యం రెడ్డి కి బెస్ట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ అవార్డు లభించింది.దేశ వ్యాప్తంగా సైబర్ నేరాల పరిశోధనకు సంబంధించి జరిపిన ఈ పోటీలో తిరుపతి అర్బన్ పోలీస్ సైబర్ వింగ్ కు ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ అవార్డు దక్కించుకోవడం గర్వకారణం.సి.ఆర్.సి.డి.ఎఫ్ (సైబర్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ ఫోరెన్సిక్స్ పరిశోధన కోసం కేంద్రం) దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలలో బెస్ట్ అవార్డు సర్టిఫికేట్ అందుకు సంబంధించిన మెమొంటోలు అర్బన్ పోలీస్ జిల్లా కార్యాలయానికి అందించడం జరిగింది.
 
 
అర్బన్ యస్.పి .వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ , అడిషనల్ యస్.పి ఇ.సుప్రజ మేడం , యస్.టి అండ్ యస్.టి సెల్ డి.యస్.పి నాగ సుబ్బన్న, సైబర్ వింగ్ ల్యాబ్ సి.ఐ సుబ్రహ్మణ్యం రెడ్డి, కమాండ్ కంట్రోల్ రూమ్ సి.ఐ అబ్బన్న ఈ అవార్డును, మెమెంటో ను యస్.పి గారి కార్యాలయం నందు అందుకున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న 748 జిల్లాల నుంచి పోలీసులు ఆయా యస్.పి  పరిధిలో ఈ పోటీలలో పాల్గొని, సంవత్సర కాలంలో వారి పురోగతిని సి.ఆర్.సి.ఐ.డి.ఎఫ్ కి నివేదికలు పంపారు.అన్ని వేదికలను పరిశీలించిన సెలక్షన్ కమిటీ తిరుపతి అర్బన్ జిల్లా సైబర్ టీంకు బెస్ట్ నేషనల్ అవార్డును ప్రకటించింది.ఆధునికమైన టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరాలను త్వరితగతిన పరిష్కరించి తమ ప్రతిభను నిరూపించుకునందుకు బెస్ట్ ఇన్వెస్టిగేటర్, వారికి అవసరమైన సహకారాన్ని సకాలంలో అందించి వారిని ముందుకు నడిపించి నందుకు యస్.పి కి బెస్ట్ మెంటార్ అవార్డ్ లభించింది.ఈ సందర్భంగా అర్బన్ యస్.పి వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్  మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన గొప్ప అవార్డు లభించడం చిన్న విషయం కాదు.
 
 
అకుంఠిత దీక్ష, క్రమశిక్షణ, అన్నిటికీ మించి సాధించాలన్న పట్టుదల సైబర్ వింగ్ కు ఈ అవార్డును సొంతం చేశాయని అన్నారు.నాకు వచ్చిన ఈ అవార్డు సిబ్బంది అందరి సహకారం శ్రమ వాల్ల వచ్చింది. అందరు కష్టపడి ఇష్టంగా భరువుగా కాకుండా భాద్యతగా తీసుకొని సైబర్ కేసులను చేధించడంలో కృషి చేసారు. వారి పలితమే ఈ అవార్డు. నా యొక్క సిబ్బందికే ఈ అవార్డు అంకితమన్నారు.మరిన్ని విజయాలు సాధించి జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అర్బన్ పోలీసు విభాగానికి పేరు ప్రఖ్యాతులు తేవడానికి, బాధితుల ఫిర్యాదు పై వెంటనే స్పందించి వారి సమస్యలు పరిష్కరించి పోగొట్టుకున్న మొత్తాన్ని తిరిగి తెప్పించి ఇవ్వడంలో మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.అవార్డు అన్నది బాధ్యతలను పెంచడానికి ఉపయోగపడాలి కానీ, పనితీరును తగ్గించడానికి కాదని సైబర్ టీం కు గుర్తు చేశారు.ఎదిగిన కొద్దీ ఒదగాలన్న పెద్దల సామెతను దృష్టిలో ఉంచుకొని సైబర్ టీం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Best National Cyber Award for Urban Police Cyber Wing