ఒత్తిడి లేని చదువులతో ఉత్తమ ఫలితాలు సాధించాలి
– పదవ తరగతిలో టాపర్స్ కు జేఈవో సదా భార్గవి సూచన
తిరుపతి ముచ్చట్లు:

టీటీడీ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు విషయాన్ని ఆకళింపు చేసుకుని ఒత్తిడి లేకుండా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జేఈవో సదాభార్గవి సూచించారు.తిరుపతి, తిరుమల పరిధిలోని టీటీడీ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షల్లో పాఠశాల టాపర్లుగా నిలిచినవారు, 550 పైగా మార్కులు సాధించిన 17 మంది విద్యార్థులను సోమవారం జేఈవో అభినందించారు.టీటీడీ పరిపాలన భవనంలోని జేఈవో చాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా సదా భార్గవి మాట్లాడుతూ, విద్యార్థులు టీటీడీ కళాశాలల్లోనే చదివి ప్రతిభావంతులు కావాలని అన్నారు. నీట్, జేఈఈ,ఎంసెట్ లాంటి పోటీ పరీక్షలు రాయాలనే ఉత్సాహం ఉన్న విద్యార్థులకు తగిన శిక్షణ ఇప్పిస్తామని ఆమె చెప్పారు. టీటీడీ విద్యా సంస్థల్లో వసతులు, ఉత్తమ బోధనా విధానాలు విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎంతో దోహదం చేస్తాయన్నారు. మంచి ఫలితాలు రావడానికి కృషి చేసిన విద్యార్థుల తల్లి దండ్రులు, ప్రధానోపాధ్యాయులు ,ఉపాధ్యాయులను జేఈవో అభినందించారు. విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు.డిఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి, బాల మందిర్ ఏఈవో అమ్ములు, ప్రధానోపాధ్యాయులు సురేంద్రబాబు, రమణ మూర్తి, చంద్రయ్య, పద్మావతి పాల్గొన్నారు.
Tags:Best results should be achieved with stress free studies
