బాలయ్య కు శుభాకాంక్షలు వెల్లువ

Best wishes to Balayya

Best wishes to Balayya

Date:10/06/2019

హైద్రాబాద్  ముచ్చట్లు:

తన తండ్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పునికిపుచ్చుకుని తెలుగు నాట తిరుగులేని హీరోగా ఎదిగిన నటుడు నటసింహ నందమూరి బాలకృష్ణ. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలలో ఏ పాత్రనైనా అవలీలగా పోషించి కోట్లాది అభిమానులను సంపాదించుకున్న అద్భుత నటుడు బాలయ్య. సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లోనూ రాణిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. నేడు బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రముఖ కథా, మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ ట్విట్టర్ ద్వారా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ‘పాలమనసు బాలుడు! చమత్కార కృష్ణుడు! సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్ర నటనా దురంధరుడు! చలన చిత్ర, రాజకీయ సవ్యసాచి! నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.. ఆయురారోగ్య ఐస్వర్యాభివృద్ధి రస్తు.. శతమానం భవతు’ అని తన ట్వీట్‌లో పరుచూరి పేర్కొన్నారు. ఈయనతో పాటు హీరో మంచు మనోజ్, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, రచయిత గోపీ మోహన్, హీరోయిన్ హంసా నందిని తదితరులు బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

నా వయస్సు తగ్గుతోంది

Tags: Best wishes to Balayya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *