Betibachao ... Betipadavo infectious student rallies

బేటిబచావో…బేటిపడావో అంటు విద్యార్థుల ర్యాలీలు

Date:21/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఐసిడిఎస్‌ పీవో భారతి ఆధ్వర్యంలోబేటిబచావో…బేటిపడావో అంటు మహిళలు ,విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలు నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని బాలికల హైస్కూల్‌ వద్ద ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ అయిషా నస్రీన్‌తాజ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శన చేశారు. అలాగే ఈడిగపల్లె హైస్కూల్‌లో సూపర్‌వైజర్లు అరుంధతి, వెంకటరత్నమ్మ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా అయిషానస్రీన్‌తాజ్‌ మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు ఈనెల 26 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించి, మహిళల్లో చైతన్య కార్యక్రమాలు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలికల సంఖ్య తగ్గిపోతోందని తెలిపారు. బాలికల సంఖ్యను అభివృద్ధి చేసుకునేందుకు బాలికలకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపేందుకే ఈ చైతన్య కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా భ్రూణహత్యలు నివారించాలని సూచించారు. బాలికలను ఎదగనివ్వాలని, వారిని ఉన్నత చదువులు చదివించాలని సూచించారు.బాలికలకు అన్ని విధాల రక్షణ కల్పించేలా చట్టాలు ఉన్నాయని , ఈవిషయంలో తల్లిదండ్రులు ఆడపిల్లలు పుట్టారని బాదపడరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

కోలాహాలంగా పశువుల పండుగ

Tags: Betibachao … Betipadavo infectious student rallies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *