– అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి
Date:14/12/2019
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు అతిథి గృహలు, వసతి సమూదాయాలలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని వివిధ అతిథి గృహలను శనివారం మధ్యాహ్నం ఆయన వసతి, ఇంజనీరింగ్, ఎఫ్.ఎమ్.ఎస్. అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఆధ్వర్యంలో వసతి గృహాల నిర్వహణ, అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. తిరుమలలోని విశ్రాంతి భవానాలలో స్నానపు గదులలో గోడకు టైల్స్, మరికొన్ని గదులలో ఫ్లోరింగ్ మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు అయా అతిథి గృహాల వద్ద టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై భక్తుల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణగిరి విశ్రాంతి భవనం -3 లో హైదరాబాద్‌కు చెందిన శ్రీ హనుమంతు అనే భక్తుడు మాట్లాడుతూ గదులలో 24 గంటలు వేడి నీటి సౌకర్యం కల్పించాలని, గీజర్లు ఏర్పాటు చేయలని కోరారు. విష్ణుపాదం అతిథి గృహాంలో మహారాష్ట్ర సింగిలికి చెందిన శ్రీ సోమేష్ అనే భక్తుడు మాట్లాడుతూ టిటిడి అందిస్తున్న సౌకర్యాలు బాగున్నాయన్నారు. అంతకుముందు ఎస్వీ అతిథి భవనం, నారాయణగిరి విశ్రాంతి భవనాలు – 1, 2, 3 మరియు 4, కృష్ణతేజ, శ్రీవారి కుటీరం, విష్ణుపాదం, వికాస్ విశ్రాంతి భవనాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్-1 బాలాజి, ఎస్ఇ-2 నాగేశ్వరరావు, విజివో మనోహర్, ఎఫ్.ఎమ్.ఎస్. ఇఇ మల్లికార్జున ప్రసాద్, డిఇ సరస్వతి, వసతి విభాగంఒఎస్డి ప్రభాకర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మహిళల భద్రతే తమ ప్రభుత్వ ధ్యేయం
Tags:Better amenities for the devotees in guest houses