Date:21/01/2021
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వాసుపత్రులకు వచ్చేరోగులకు అన్ని రకాల సేవలు అందించి, వారికి తగిన అవగాహన కల్పించేలా సేవలు ఉండాలని ఎన్క్యూఏఎస్ఎస్ (నేషనల్ క్వాలిటి స్టాండర్ అసురెన్స్ బృందం) డాక్టర్లు నీరంజన్రెడ్డి, క్రాంతి లు తెలిపారు.గురువారం విజయవాడ నుంచి డాక్టర్ల బృందం స్థానిక ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు.మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చిర్మిలతో కలసి ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్యసేవలను, ఆపరేషన్ థియెటర్, ల్యాబ్, ఓపిలను సందర్శించి, ఆసుపత్రి ఆవరణాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా నీరంజన్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్భంధిగా అమలు చేయాలన్నారు.అలాగే రోగులు అన్నివిషయాలు తెలుసుకునేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అలాగే విద్యుత్ వైర్లు ఎక్కడ బయట కన్పించకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోగులకు పడకలు, బెంచిలు తగినంతగా అందుబాటులో ఉంచాలన్నారు. ఆసుపత్రి ఆవరణంలో ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు ల్యాబ్లు, ఆపరేషన్ థియెటర్లు ఉండాలని, వీటితో పాటు అన్నిరకాల మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఈ మేరకు నివేదికలను ప్రభుత్వానికి పంపి, తగు చర్యలు చేపడుతామని డాక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్శులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పుంగనూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలపై పరిశీలన
Tags; Better services to patients in Punganur Government Gazette – Dr. Niranjan Reddy