బ్రహ్మూత్సవాల్లో భక్తులకు మెరుగైన రవాణా సేవలు

Better transport services for devotees in the Brahmins

Better transport services for devotees in the Brahmins

Date:19/09/2018
తిరుమల ముచ్చట్లు:
శ్రీవారి వార్షిక  బ్రహ్మూత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగ్గా రవాణా సేవలు అందించామని టిటిడి ట్రాన్స్పోర్టు జనరల్ మేనేజర్  శేషారెడ్డి తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్లో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా  శేషారెడ్డి మాట్లాడుతూ తిరుమలలోని పలు ప్రాంతాలకు భక్తులను  చేరవేసేందుకు ఉచిత బస్సులు, తిరుపతి – తిరుమల మధ్య తగినన్ని ఆర్టిసి బస్సులు ఏర్పాటచేసినట్టు తెలిపారు.
అన్నప్రసాదం, వైద్య విభాగాలకు తగినన్ని వాహనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఘాట్ రోడ్లలో  వాహనాల మరమ్మతులకు గురైనపుడు, ప్రమాదాలు జరిగినపుడు వెంటనే స్పందించేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో ఆటోక్లినిక్లు, క్రెయిన్లతోపాటు ద్విచక్రవాహనాల మెకానిక్లను అందుబాటులో ఉంచామని వివరించారు.         సెప్టెంబరు 17వ తేదీ గరుడసేవ సందర్భంగా టిటిడి రవాణా విభాగం, ఆర్.టి.సి. సమన్వయంతో తిరుమలకు విచ్చేసే ఘాట్ రోడ్లో 8ప్రాంతాలలో, తిరుపతికి వెళ్ళె ఘాట్ రోడ్డులో 8 ప్రాంతాలలో క్రేన్లు, ఆటో క్లినర్స్ను ఏర్పాటు చేసి ట్రాఫిక్కు ట్లు ఆయన తెలిపారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా 14 ధర్మ రథాలు రెండు వైపులా 400 ట్రిప్పులు తిరుగుతు భక్తులను తిరుమలలోని  వివిధ ప్రాంతాలకు చెరవేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం శ్రీవారి మెట్టు నుండి శ్రీనివాసమంగాపురానికి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేశామన్నారు. బ్రహ్మూత్సవాల సందర్భంగా తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తగిన భాగస్వామ్యం అందించామన్నారు.
సెప్టెంబరు 17వ తేదీ గరుడసేవ సందర్భంగా టిటిడి రవాణా విభాగం, ఆర్.టి.సి. సమన్వయంతో తిరుమలకు విచ్చేసే ఘాట్ రోడ్లో 8ప్రాంతాలలో, తిరుపతికి వెళ్ళె ఘాట్ రోడ్డులో 8 ప్రాంతాలలో క్రేన్లు, ఆటో క్లినర్స్ను ఏర్పాటు చేసి ట్రాఫిక్కు ఆయన తెలిపారు.  బ్రహ్మోత్సవాల సందర్భంగా 14 ధర్మ రథాలు రెండు వైపులా 400 ట్రిప్పులు తిరుగుతు భక్తులను తిరుమలలోని  వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం శ్రీవారి మెట్టు నుండి శ్రీనివాసమంగాపురానికి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేశామన్నారు.
Tags:Better transport services for devotees in the Brahmins

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *