ఉపేంద్ర, రవీంద్రలకు మెరుగైన వైద్యం అందించాలి.సిఐటియు

కడప ముచ్చట్లు:

కడప వైయస్సార్ జిల్లా వేముల మండలం యురేనియం కర్మాగారం లో గాయాల పాలైన ఉపేంద్ర, రవీంద్రలకు మెరుగైన వైద్యం అందించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కామనూరు శ్రీనివాసులరెడ్డి,బి మనోహర్ ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశారు ముఖ్యంగా యురేనియం కర్మాగారం లో ఇలాంటి సంఘటనలు జరగడం సాధారణ మయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు  ఈ విషయం లో యురేనియం యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉండడం దుర్మార్గమన్నారు కాంట్రాక్టు కార్మికులతో శ్రమ దోపిడి చేస్తూ తక్కువ వేతనాలు ఇవ్వడం శోచనీయమన్నారు కార్మికులకు ప్రమాదాల నుంచి రక్షణ కల్పంచక పోవడం విచారకరమన్నారు ఇప్పటికైనా యాజమాన్యం కార్మికుల ప్రాణాల పట్ల నిర్లక్ష్యం వీడి  ఉపేంద్ర, రవీంద్రలకు  మెరుగైన వైద్యం అందించి వారి కుటుంబాలకు మేలు చేకూర్చాలని డిమాండ్ చేశారు అంతే కాకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలి కోరారు.

 

Tags: Better treatment should be provided to Upendra and Ravindra. CITU

Leave A Reply

Your email address will not be published.