ఎస్పీ, బీఎస్పీల మధ్య సీట్ల ఒప్పందం

Between the SP and the BSP, the seat deal

Between the SP and the BSP, the seat deal

Date:12/01/2019
బెంగాల్ ముచ్చట్లు:
ఎస్పీ, బీఎస్పీల మధ్య కుదిరిన సీట్లు ఒప్పందంపై ఎన్డీయేతర పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాయవతి, అఖిలేష్‌ యాదవ్‌ల చారిత్రక ప్రకటనను స్వాగతిస్తున్నట్లు బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా వారికి అభినందనలు తెలిపారు. అలాగే ఆర్జేడీ నేత, బిహార్‌ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్‌ కూడా మాయా,యాదవ్‌ కూటమిపై స్పందించారు. యూపీలో ఏర్పడిన కూటమితోనే బీజేపీ పథనం ప్రారంభమవుతుందంటూ తేజస్వీ వ్యాఖ్యానించారు.రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓటమే లక్ష్యంగా దశాబ్ధాల వైరుధ్యాన్ని పక్కన్న పెట్టి ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపిన విషయం తెలిసిందే. దీనిపై వారు వివరణ ఇస్తూ చెరో 38 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు శనివారం ఉమ్మడి ప్రకటన ద్వారా ప్రకటించారు. ముందునుంచి అనుకున్న విధంగానే కాంగ్రెస్‌కు కూటమిలో స్థానం కల్పించలేదు. కానీ ప్రస్తుతం రాహుల్‌, సోనియా ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథి, రాయబరేలి స్థానాలను వారికి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కాగా 26ఏళ్ల అనంతరం ఎస్పీ,బీఎస్పీలు చేతులుకపడం విశేషం.
Tags:Between the SP and the BSP, the seat deal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *