బెజవాడకు హెచ్ సీఎల్ వచ్చేసిందోచ్

Bezawada has come to HEL

Bezawada has come to HEL

Date:08/10/2018
విజయవాడ  ముచ్చట్లు:
నవ్యాంధ్ర ఐటి రంగంలో, మరో కీలక పరిణామం చోటు చేసుకోంది.  గన్నవరం, కీసరపల్లి గ్రామంలో హెచ్సిఎల్ భూమి పూజ కార్యక్రమం జరగనుంది.మధ్యాహ్నం 3 గంటలకు హెచ్సిఎల్ గన్నవరం క్యాంపస్ కి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో హెచ్సిఎల్ అధినేత శివ్ నాడార్ కుమార్తె హెచ్సిఎల్ కార్పొరేషన్ సిఈఓ రోషిని నాడార్ పాల్గొననున్నారు.స్థానిక ప్రజాప్రతినిధులు,మంత్రులు దేవినేని ఉమ,కొల్లు.రవీంద్ర తదితరులు పాల్గొననున్నారు. మే 12,2017 న మంత్రి నారా లోకేష్ హెచ్సిఎల్ అధినేత శివ్ నాడార్ ని ఢిల్లీ లోని హెచ్సిఎల్ కార్యాలయంలో కలిసారు.
ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ 1 అనడానికి ఈ భేటీ ఒక ఉదాహరణ గా నిలిచింది.హెచ్సిఎల్ తో ఒప్పందం చేసుకున్న 45 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చి,భూమి కేటాయించి,ఆ భూమి పాత్రలను తీసుకోని నేరుగా హెచ్సిఎల్ కంపెనీకి వెళ్లి అధినేత శివ్ నాడార్ కి అందజేసారు మంత్రి నారా లోకేష్.నలభై ఏళ్ల చరిత్ర… ప్రపంచ ఐటీ రంగంలో హెచ్సిఎల్ ఒక నమ్మకమైన కంపెనీ గా పేరుగాంచింది.40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో హెచ్సిఎల్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 250 కంపెనీలకు,గ్లోబల్ 2000 కంపెనీల్లో 650 కంపెనీలకు వివిధ ఐటీ సర్వీసెస్ అందించి అగ్రగామిగా ఎదిగింది.8 యూఎస్ బిలియన్ డాలర్ల రెవిన్యూ సాధించింది.
41 దేశాల్లో కార్యకలాపాలు,ప్రపంచవ్యాప్తంగా 1 లాక్షా 24 వేల మంది ఉద్యోగులు హెచ్సిఎల్ కంపెనీలో పనిచేస్తున్నారు.ప్రపంచవ్యాపంగా ఐటీ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి,నూతన ఆవిష్కరణల పరిశోధన కేంద్రాలు,డెలివరీ కేంద్రాలు హెచ్సిఎల్ నిర్వహిస్తుంది.నవ్యాంధ్రప్రదేశ్ లో హెచ్సిఎల్… ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో మొదటి భారీ పెట్టుబడి హెచ్సిఎల్ పెట్టబోతోంది.750 కోట్ల పెట్టుబడి,7500 మందికి ఉద్యోగాలు పది ఏళ్లలో కల్పించబోతుంది. రెండు దశల్లో హెచ్సిఎల్ అమరావతి లో కంపెనీ కార్యకలాపాలు విస్తరించనుంది.గన్నవరం లోని కీసరపల్లి గ్రామంలో 28 ఎకరాల విస్తీర్ణంలో మొదటి దశ పనులు ప్రారంభించబోతుంది.
ఇక్కడ 400 కోట్ల పెట్టుబడితో పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించనుంది హెచ్సిఎల్.ఈ కేంద్రంలోనే 4000 మందికి హై ఎండ్ ఉద్యోగాలు రానున్నాయి.కేవలం ఒక్క సంవత్సరంలోనే మొదటి భవనం నిర్మాణం పూర్తి చేయనుంది హెచ్సిఎల్.మిగిలిన భవనాలను రానున్న ఏడేళ్లలో పూర్తి చేయనుంది.రెండొవ దశలో హెచ్సిఎల్ కంపెనీని అమరావతి నూతన రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది.20 ఎకరాల్లో కంపెనీ ఏర్పాటు కానుంది.5 సంవత్సరాల కాల వ్యవధిలో 350 కోట్ల పెట్టుబడి,3500 మందికి ఉద్యోగాలు రెండొవ దశలో భాగంగా హెచ్సిఎల్ కల్పించనుంది.
Tags:Bezawada has come to HEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *