బెజవాడ టూ డైరక్ట్ సింగపూర్….

Date:13/03/2018
విజయవాడ ముచ్చట్లు:
సింగపూర్‌ విమానయాన సంస్థకు చెందిన సిల్క్‌ ఎయిర్‌ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టింది… సిల్క్‌ఎయిర్‌ బృందం గన్నవరం ఎయిర్ పోర్ట్ ని సందర్శించింది… అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. సింగపూర్‌ నుంచి ఇక్కడికి నేరుగా విమాన సర్వీసులను నడిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించడానికే ఈ బృందం విచ్చేసింది… అంతర్జాతీయ టెర్మినల్‌ భవనంలో ఉన్న ఏర్పాట్లు, రన్‌వే సహా అన్నింటినీ పరిశీలించారు.విమానాశ్రయంలో ఉన్న ఏర్పాట్లపై వారు సంతృప్తి వ్యక్తం చేసి వెళ్లారు. విజయవాడ నుంచి ముంబయికి ప్రస్తుతం నడుస్తున్న ఎయిరిండియా సర్వీసును దుబాయ్‌ వరకూ పొడిగించనున్నట్టు కేంద్ర విమానయానశాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా సిల్క్‌ఎయిర్‌ కూడా సానుకూలంగా స్పందించడం శుభపరిణామం. విజయవాడ నుంచి నేరుగా దుబాయ్‌, సింగపూర్‌ దేశాలకు విమాన సర్వీసులను తొలుత ప్రారంభించాలని స్థానిక పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు చాలాకాలంగా కోరుతున్నాయి. ఆ రెండు దేశాలకు వెళ్లిపోతే ప్రపంచంలో ఎక్కడికైనా తేలికగా చేరుకునేందుకు విమాన కనెక్టివిటీ ఉంటుంది.అందుకే తొలుత కనీసం వారంలో రెండు మూడు రోజులైనా దుబాయ్‌, సింగపూర్‌లకు సర్వీసులను నడపాలని ఇక్కడి వాళ్లు కోరుతున్నారు. మార్చి 15 తర్వాత అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు తాము సిద్ధంగా ఉంటామంటూ విమానాశ్రయం అధికారులు ఎయిరిండియాకు కొద్దిరోజుల కిందట లేఖను సైతం సమర్పించారు. విదేశీ సర్వీసును ప్రారంభించాలంటే కనీసం 45 రోజుల ముందు నుంచి టిక్కెట్లను విక్రయించేందుకు షెడ్యూల్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. అందుకే ముందస్తుగా ఎయిరిండియాకు విమానాశ్రయం తరఫున అనుమతి తెలియజేస్తూ లేఖను పంపించారు. విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన 15 మంది సిబ్బంది గన్నవరం విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు.
Tags: Bezwada to direct Singapore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *