భద్రాచలం ప్రశాంతం

Date:19/10/2019

భద్రాచలం ముచ్చట్లు:

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 5వ తారికు నుండి వివిధ రకాలుగా నిర్శన చేపట్టి ఈరోజు బంద్ కు పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ అలాగే అఖిల పక్ష పార్టీలు తెలంగాణ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. అందులో భాగంగా ప్రయాణికుల ఎటువంటి ఆటంకం కలగకుండా భద్రాచలం డిపో వద్ద పోలీసు బందోబస్తుగా స్పెషల్ పార్టీ ఆధ్వర్యంలో బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నామని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర విలేకర్ల కు తెలిపారు. భద్రాచలంలో ప్రజలకు ఆటంకం కలిగించే పొలిటికల్ పార్టీలు మరియు ఇతర ఇతర సంఘాలు ఏమైనా వైలెన్స్ చేస్తే వాళ్ళ పై చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ అన్నారు. ఉదయం నుంచి 15 మందిని కస్టడీలో తీసుకున్నామని, చట్ట విరుద్ధంగా బందుకు మద్దతు తెలిపే వారిపై ఎటువంటి చర్యలైన తీసుకొనుటకు సిద్ధంగా ఉన్నామని, పోలీసు భద్రత ఏరియా లో ఎక్కువ గా నియమించమని యధావిధిగా షాపులు వ్యాపారస్తులు వ్యాపార చేసుకోవచ్చని ఎవరైనా ఇబ్బందులు తలపెడితే వెంటనే మాకు తెలియపరచాలని మా సిబ్బంది మఫ్టి తిరుగుతున్నారని ఎక్కడైనా అల్లర్లు చేసినట్టు కనపడితే కస్టడీ లోకి తీసుకుంటామని ఆయన తెలిపారు.

మద్యం మత్తులో యువకుడి కారు డ్రైవింగ్…ఎస్సైకు తీవ్ర గాయాలు

Tags: Bhadrachalam is calm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *