డిసెంబరు 4న భగవద్గీత అఖండ పారాయణం
తిరుమల ముచ్చట్లు :
గీతా జయంతిని పురస్కరించుకొని డిసెంబరు 4న తిరుమల నాదనీరాజనం వేదికపై సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఉదయం 7 నుండి భగవద్గీతలోని 18 ఆధ్యాయాల్లో గల 700 శ్లోకాలను పండితులు నిరంతరాయంగా పారాయణం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణదారులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం శాస్త్రీయ పండితులు, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భగవద్గీత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు 2020 సెప్టెంబర్ 10వ తేదీ నుండి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గీతా పారాయణం నిర్వహిస్తున్నారు.

Tags; Bhagavad Gita Akhanda Parayanam on 4th December
