హైదరాబాద్ కు భక్తచరణ్ దాస్ బృందం

Date:08/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ వేగవంతమయింది. ఈ నేపధ్యంలో ఏఐసీసీ నియమించిన భక్తచరణ్ దాస్ కమిటీ ఈ నెల 10 హైదరాబాద్ కు రానుంది.  నాలుగు రోజులుపాటు ఇక్కడే వుండి సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక పై చర్చించనుంది. ఈనెల 20 లోపు పార్టీ అభ్యర్థుల ప్రకటన వెలువడనుందని సమాచారం. మొదటగా ఒకే అభ్యర్థి ఉన్న స్థానాలను కమిటీ మొదట ప్రకటించనుంది. పోటీ ఉన్న నియోజక వర్గాల్లో సర్వేల ఆధారంగా లిస్ట్ ను తయారు చేయబోతోంది. ఒక్కో.నియోజక వర్గం లో ఇద్దరు వ్యక్తులను ఫైనల్ చేసి పార్టీ సినీయర్ నే  అహ్మద్ పటేల్ కు పంపుతుంది. టీడీపీ కి 12 స్థానాలు, టీజేఎస్ కు 3 స్థానాలు, సీపీఐ కి 4 స్థానాలు కేటాయించవచ్చని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ లు  సీట్ల సంఖ్య పై ఒక అవగాహనకు వచ్చాయి. అయితే, ఏ ఏ సీట్లు కేటాయించాలి అన్నదానిపై సందిగ్దత మాత్రం వీడలేదు.
Tags:Bhaktarsh Das Team for Hyderabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *