వరల్డ్ రికార్డు సాధించిన యువ ఇంజనీర్ భాను సాయి ప్రతాప్

కేవలం ఆరు గంటలలో 22 పేజీలు
నూతన వెబ్ సైట్ రూప కల్పన
చెన్నై లింక  బుక్ ఆఫ్ రికార్డులో చోటు
ప్రశంశా పత్రము, గోల్డ్ మెడల్ అందజేత
ప్రభుత్వ సహకారం అందిస్తే … ఇంకా రాణిస్తా
భాను సాయి ప్రతాప్

మంగళగిరి ముచ్చట్లు:

మంగళగిరి పట్టణానికి చెందిన యువ ఇంజనీర్
వినుకొండ భాను సాయి ప్రతాప్ వరల్డ్ రికార్డు సాధించారు. ప్రభుత్వమునకు
సంబందించి, 22 పేజీల వెబ్సైట్ను ప్రతాప్ కేవలం ఆరు గంటలలో రూపొందించి,
రికార్డు సృష్టించారు. ప్రపంచంలో ఏ ఇంజనీరు కూడా ఇటు వంటి రికార్డు
సాధించి యుండలేదు. వృత్తిలో కృషి, శ్రమ, కొత్త ఆలోచన, పట్టుదల
భానుసాయి ప్రతాప్ వరల్డ్ రికార్డుకు దోహద పడ్డాయి.
చెన్నైకు చెందిన ‘లింకన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో ప్రతాప్ వరల్డ్ రికార్డుగా
చోటు దక్కించుకున్నారు. ఆ సంస్థ నుండి ప్రశంశా పత్రం, గోల్డు మెడల్
అందుకున్నారు. అరుదైన వరల్డ్ రికార్డు సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తొలి
తెలుగు వ్యక్తిగా భాను సాయి ప్రతాప్
చరిత్ర పుటలలోకి ఎక్కారు. ఇది
ఆంధ్రప్రదేశ్ కు  గర్వకారణమని చెప్ప వచ్చు.
భాను సాయి ప్రతాప్ ఒక యువ ఇంజనీరు. ఆయన స్వస్థలం నెల్లూరు |
జిల్లా, బుచ్చిరెడ్డి పాలెం. ఆయన విద్యాభ్యాసం
2014 సం.లో బి.టెక్ కంప్యూటర్సైన్సలో ఉత్తీర్ణుడైనాడు.
అంతా అక్కడే గడిచింది. ఆయన
2015 సం.లో  హైదరాబాద్ లోని ‘మౌరీ టెక్’ లో ఉద్యోగంలో చేరాడు. ఆనాటి నుండి నేటి వరకు
అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ
కంపెనీ ప్రతి నిధుల ప్రశంశలు
అందుకున్నారు.
మౌరీటెక్ కంపెనీతో పాటు భాను సాయి ప్రతాప్ ప్రస్తుతము మంగళగిరి
ఆటో నగర్ ఎ.పి.ఐ.ఐ.సిలో ఐ.టి. మేనేజర్ ప్రభుత్వానికి సంబందించిన
జుడీషియరీ ప్రివ్యూలను, ఐ.టి. మేనేజర్ ఇంకా ఎ.పి. జనరల్ డెవలప్మెంటు
కార్పోరేషన్లో ఐ.టి. మేనేజరుగా ఎ.పి. ఎకనామిక్ డెవలప్ మెంటు బోర్డు, అలాగే
ఎ.పి. ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్, ఆంధ్ర ప్రదేశ్ సర్వే డిపార్ట్ మెంటు క్రిస్ సిటీ,
(కృష్ణపట్నం ఇండస్ట్రియల్ కారిడార్) వంటి పలు ప్రభుత్వ సంస్థలలో ఐ.టి.
మేనేజర్గా పనిచేస్తున్నారు.
తాజాగా ‘మౌరిటెక్’ మేనేజ్ మెంటు ఇచ్చిన సహకారంతో నూతన వెబ్సైట్
రూప కల్పన చేసి, వరల్డ్ రికార్డు విజయం సాధించడం విశేషం.

 

Post Midle

Tags: Bhanu Sai Pratap is a young world record holder

Post Midle
Natyam ad