Natyam ad

భారత్ భేష్.. ఐఎంఎఫ్

న్యూఢిల్లీ ముచ్చట్లు:
 
ఫిబ్ర‌వ‌రి 1 వ తేదీన కేంద్రం బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. దీనిపై దేశంలోని ప‌లు రాజ‌కీయ పార్టీలు విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా, ఈ బ‌డ్జెట్‌పై అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ ఆలోచ‌నాత్మ‌క‌మైన విధాన ఎజెండాగా ఐఎంఎఫ్ వర్ణించింది. ప‌రిశోధ‌న అభివృద్దిలో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌తో పాటు హ్యుమ‌న్ క్యాపిట‌ల్‌, డిజిట‌లైజేష‌న్‌కు ప్రాధాన్య‌త ఇచ్చార‌ని ఐఎంఎఫ్ పేర్కొన్న‌ది.ప్ర‌స్తుతం భార‌త వృద్దిరేటు బాగుంద‌ని, 2022లో వృద్ధిరేటును 9.5 శాతం నుంచి 9 కి త‌గ్గించిన‌ప్ప‌టికీ, రాబోయే రోజుల్లో వృద్ధిరేటు తిరిగి పెరుగుతుంద‌ని ఐఎంఎఫ్ పేర్కొన్న‌ది. క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వివిధ దేశాలు ఆర్థిక విధానంలో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయని, అయితే, ఇది భార‌త్ మార్కెట్‌పై ప్ర‌భావం త‌క్కువ‌గానే ఉంద‌ని, ముందు జాగ్ర‌త్త‌గా తీసుకున్న నిర్ణ‌యాలు, విధాన‌ల కార‌ణంగానే ఇది సాధ్య‌మైన‌ట్టు ఐఎంఎఫ్ పేర్కొన్న‌ది.
 
Tags; Bharat Bhesh .. IMF