భారత రత్న సివి.రామన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
పుంగనూరు ముచ్చట్లు:
సైన్సురంగంలో ఉన్న విద్యార్థులందరు భారతరత్న డాక్టర్ సివి.రామన్‌ను ఆదర్శంగా తీసుకుని సైన్సు రంగంలో రాణించాలని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి సూచించారు. మంగళవారం సైన్సు దినోత్సవాన్ని అకాడమిలో, బాష్యం పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే వివిధ రకాల పరిశోదనలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాష్యంపాఠశాల ఇన్‌చార్జ్ లక్ష్మణ్‌రావు, ప్రిన్సిపాల్ సుబ్రమణ్యంతో పాటు ఉపాధ్యాయులు , రుపేష్, రెడ్డెమ్మ, బాష తదితరులు పాల్గొన్నారు.

Tags: Bharat Ratna CV.Raman should be taken as an example
