Bharatbandh is partial

భారత్‌బంద్‌ పాక్షికం

Date:23/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పును నిరశిస్తూ చేపట్టిన భారత్‌బంద్‌ పాక్షికంగా జరిగింది. ఆదివారం ఏఐటీయుసీ కార్యదర్శి వెంకట్రమణారెడ్డి, హాఫిజ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో పలు సంఘాలు స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద గల జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్రమణా రెడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టు రిజర్వేషన్లను ప్రాథమిక హక్కు కాదు అని పేర్కొనడంపై బాధకరమన్నారు. ఈ తీర్పుపై నిరసన వ్యక్తం చేస్తూ భారత్‌బంద్‌కు పిలుపునిచ్చిన నేపధ్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కోర్టు తీర్పుఫలితంగా భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు హక్కులు కోల్పోతారని తెలిపారు. బంద్‌ ప్రబావం ఏమి లేకపోయింది. దుకాణాలు తెరిచారు. వాహనాల రాకపోకలు జరిగాయి. నిరసన కార్యక్రమాలలో బీమ్‌అద్మీ పార్టీ , ఏఐడిఆర్‌ఎఫ్‌ ,ఎస్సీ, ఎస్టీ ,బీసీ , క్రిస్టియన్‌ ప్రతినిధులు కరాటే రామచంద్ర, మదుబాబు, రాజు, జెవి.నాగరాజు, చిన్నప్ప, ముభారక్‌ తదితరులు పాల్గొన్నారు. బంద్‌ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ పోలీసులు జాగ్రత్తలు చేపట్టారు.

పేద విద్యార్థులను ఆదుకోవడమే ఆశయం

Tags: Bharatbandh is partial

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *