భరత్ పుట్టడం..దేశానికి భారం 

Date:07/02/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
తనను ప్రేమించలేదనే కోపంతో హైదరాబాద్‌లోని బర్కత్‌పురాలో ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. కొబ్బరి బోండాలు నరికే కత్తితో అత్యంత దారుణంగా దాడిచేశాడు. నిందితుడు భరత్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. సత్యనగర్‌కు చెందిన భరత్, మధులికలు పక్క, పక్క ఇళ్లలోనే ఉంటున్నారు. భరత్ కొంతకాలంగా ప్రేమ పేరుతో మధులిక వెంటపడుతున్నాడు. ఆమె ప్రేమను తిరస్కరించింది. కొద్దిరోజుల క్రితం షీ టీమ్‌కు కూడా పట్టించింది. దీంతో భరత్‌కు తల్లిదండ్రుల సమక్షంలో భరోసా సెంటర్‌లో కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. కానీ, భరత్ బుద్ధి మాత్రం మారలేదు. తన ప్రేమను నిరాకరించిందని మధులికపై కోపం పెంచుకున్నాడు. ఆమె కాలేజీకి వెళుతున్న సమయంలో వెంటపడి.. కొబ్బరి బోండాల కత్తితో దారుణంగా నరికేశాడు. ప్రస్తుతం మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న మధులిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమె మెడ వెనుక భాగం, పొట్ట, వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే, ఈ ఘటనపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ఆడపిల్లపై దాడి చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ‘మానవత్వం లేని మగాడు పుట్టడం దేనికి? మనిషి అనే వాడు ఒక ఆడపిల్ల మీద దాడి చేసే ముందు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తలుచుకుంటే ఇలాంటివి ఏ నాడు జరగవు. ఆడపిల్లల్ని రక్షించాల్సిన మగాడు ఆడపిల్ల అనుభవించే నరకానికి కారకుడు ఐతే ఇంక మనం పుట్టిన దానికి అర్థం ఏమిటి??’ అని తన ట్వీట్‌లో మనోజ్ పేర్కొన్నారు.
Tags; Bharath’s birthday .. burden to the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *