-భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ అధ్యక్షులు దాసరి రాజశేఖర్
Date:05/12/2020
జగిత్యాల ముచ్చట్లు:
గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రెండవ అతిపెద్ద పార్టీగా తెలంగాణలో అవతరించిన సందర్భంగా కోరుట్ల పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దాసరి రాజశేఖర్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా దాసరి రాజశేఖర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో గతంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో నాలుగు స్థానాలకే పరిమితం అయిన భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం 48 స్థానాలు గెలుపొందడం పార్టీ కార్యకర్తలు కష్టపడ్డారని ఈ విజయం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందని మునుముందు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారంలోకి వచ్చే సత్తా ఉందని అందుకు నిదర్శనం ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పతనం ప్రారంభమైందని అసలైన ఉద్యమకారులను పక్కనపెట్టి ఉద్యమ ముసుగులో గద్దెనెక్కిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కుటుంబము లబ్ధిపొందాలని ప్రజలను రాష్ట్రాన్ని నట్టేట ముంచారని అన్నారు .
ఈ సందర్భంగా పార్టీలో చేరిన అడ్డగట్ల ఆంజనేయులుకు భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ అధ్యక్షుడు దాసరి రాజశేఖర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈకార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పీసరి నర్సయ్య కోరుట్ల పట్టణ మాజీ అధ్యక్షులు ఇందూరి తిరుమల వాసు మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఇల్లెందుల కృష్ణమాచారి కౌన్సిలర్ పెండం గణేష్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గిన్నెల అశోక్ నరసింహా చలం రాచకొండ శ్రీనివాస రావు మాసం ప్రసాద్ గిన్నెల సాగర్ పోతుగంటి శ్రీనివాస్ గందె నవీన్ జక్కుల ప్రవీణ్ దామ రాజేష్ రంజిత్ రావు గుజ్జెల అజయ్ కటుకం క్రాంతి బత్తిని అనుదీప్ రాచకొండ రంజిత్ గాజుల నితిష్ గుద్దేటి రాజేందర్ వల్లకొండ శ్రీనివాస్ గట్ల ప్రకాష్ కొండబత్తిని అమర్నాథ్ అల్లె రాజ్ కుమార్, పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జాంభి రెడ్డి” టీజర్ అదిరిపోయింది.. నాకు బాగా నచ్చింది.. సమంత !!
Tags: Bharatiya Janata Party celebrations in Korut