పోలీసుల అదుపులో… భార్గవరామ్..?

Date:13/01/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో కీలక నిందితుడు భార్గవరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసులు ఇప్పటికే ఈ కేసులో 19 మంది నిందితులు అని గుర్తించారు. అఖిల ప్రియ, సోమవారం అరెస్టయిన ముగ్గురితోపాటు.. తాజాగా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా 11 మందిలో భార్గవరామ్‌, గుంటూరు శ్రీను ఉన్నారు. పరారీలో ఉన్నవారంతా ఎక్కడ తలదాచుకుంటున్నారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.అయితే పోలీసులు మాత్రం.. భార్గవరామ్‌, గుంటూరు శ్రీను కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు. నిందితులను గుర్తించామని, ఏ క్షణంలో అయినా వారిని అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.బెంగుళూరు, పూణెలో భార్గవరామ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలించిన విషయం తెలిసిందే. మరోవైపు బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ రెండో రోజు కష్టడీ విచారణ ముగిసింది. భూమా అఖిల ప్రియను కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల కస్టడీకి సమయం ముగిసింది. కస్టడీలోకి తీసుకున్న భూమా అఖిల ప్రియను నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, ఇద్దరు ఏసీపీ లు ఉదయం 10 గంటల నుంచి ప్రశ్నించారు.

 

అఖిల ప్రియను పోలీసులు ఎన్నో ప్రశ్నలు వేశారు.కిడ్నాపర్లు తో భూమా అఖిల ప్రియ మాట్లాడిన కాల్స్ గురించి కూడా ఆరా తీశారు. అందుకు అఖిలప్రియ తాను రాజకీయ నాయకురాలని చాలా మంది తనకు కాల్స్ చేస్తుంటారని అన్నారు. అందులో భాగంగానే గుంటూరు శీనుతో కూడా మాట్లాడినట్లు గా భూమా అఖిల ప్రియ తెలిపింది. ఈ కేసులో A3 గా ఉన్న భర్త భార్గవ్ రామ్ ఇక్కడ ఉన్నాడని అతని ఆచూకీ తెలుపమని అఖిలప్రియ పోలీసులు అడిగారు. భార్గావ్ రామ్ ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదంటూ అఖిల ప్రియ పోలుసులకు చెప్పింది.టవర్ లోకేషన్, సిమ్ కార్డ్ నంబర్స్ ను అఖిల ప్రియ ముందుంచి కిడ్నాప్ సంబంధించిన వివరాలను గురించి ప్రశ్నించారు దీంతో అఖిలప్రియ తనకు ఏమీ తెలియదని సమాధానం చెప్పింది. 48 ఎకరాల ల్యాండ్ వ్యవహారం లో తమకు , ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులకు వివాదం ఉందనే విషయం నిజమేనని గతంలో చాలా సార్లు భూ వ్యవహారం పై మాట్లాడే ప్రయత్నం చేశామని, అంతే కానీ ఈ కిడ్నాప్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ అఖిలప్రియ పోలీసుల ముందు వెల్లడించింది.

 

 

సినిమాను చూపించి ట్రైనింగ్పీ మాజీ మంత్రి అఖిలప్రియ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అఖిలప్రియ సహా ఆమె గ్రూపు మొత్తం సినిమా తరహాలో కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్లు తేలింది. కిడ్నాప్ కోసం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన సినిమాని చూపించి.. భార్గవ్ రామ్ సోదరుడు చంద్రహాస్.. కిడ్నాపర్లకు ట్రైయినింగ్ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఐటీ అధికారులుగా ఎలా నటించాలనే దానిపై వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. యూసఫ్‌గూడలోని ఎంజీఎం స్కూల్‌లో కిడ్నాప్‌పై చంద్రహాస్ శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

 

కిడ్నాప్‌కు సంబంధించిన ఈ విషయాలన్నింటిపై విచారణలో భాగంగా అఖిలప్రియ చెప్పినట్లు సమాచారం. స్వయంగా సినిమా గురించి చంద్రహాస్‌తో అఖిలప్రియ చెప్పినట్లు తెలుస్తోంది. అఖిల ప్రియ ఆదేశాలకు అనుగుణంగానే అక్షయ్ కుమార్ సినిమా చూపించి భార్గవ్ రామ్, చంద్రహాస్ కిడ్నాప్ చేయించినట్లు తెలుస్తోంది.ఐటీ అధికారుల చెకింగ్ డ్రెస్సులు ఐడీ కార్డులను చంద్రహాస్ తయారు చేసినట్లు అఖిల ప్రియ విచారణలో వివరించారు. శ్రీ నగర్ కాలనీలోని ఒక కాస్ట్యూమ్స్ కంపెనీ నుంచి ఐటీ అధికారుల దుస్తులను కిడ్నాపర్లు అద్దెకు తీసుకున్నట్లు చెప్పారు.

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags:Bhargavaram in police custody?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *