– లారీ డ్రైవర్ పరిస్థితి విషమం..
పీలేరు ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా, పీలేరు నియోజకవర్గం లోని వాల్మీపురం మండలం, విఠలం వద్ద ఐషర్ లారీ- భారతి బస్సు ఎదు రెదురు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఐచర్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతని పరిస్థితి విషమించింది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి నుండి బెంగళూరు వెళుతున్న భారతి బస్సును సోమవారం సాయంత్రం వాల్మీకిపురం తిరుపతి రోడ్డులో వెళుతున్న ఐషర్ లారీ విఠలం వద్ద ఎదు రెదురు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. స్థానికులు గుర్తించి లారీ డ్రైవర్ను బయటకు తీసి వాల్మీకిపురం ఆస్పత్రికి తరలించారు.బస్సులోని ప్రయాణికులు పలువురు గాయపడ్డారు.. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Bharti bus and lorry collided head on.