Date:25/01/2021
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మండల అభివృద్ధి కమిటి అధ్యక్షుడుగా సింగిరిగుంట ఎంపీటీసీ అక్కిసాని భాస్కర్‌రెడ్డిని నియమించారు. సోమవారం తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు సమావేశమైయ్యారు. మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు భాస్కర్‌రెడ్డిని అధ్యక్షుడుగా , ఉపాధ్యక్షురాలుగా జెడ్పిటిసి జ్ఞానప్రసన్నను నియమించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే మండల అభివృద్ధి కమిటిమెంబర్లుగా శైలజ, ధరణి, పురుషోత్తం,సరోజమ్మ,సురేంద్ర, ఈశ్వరమ్మ, విద్యావతి, నాగభూషణంరెడ్డి,సుప్రజ, సి.సులోచన, నంజుండప్ప, రెడ్డెప్ప, రాజ్యలక్ష్మి, శ్యామలమ్మ, శివకుమార్లను నియమించారు. వీరందరు మండల అభివృద్ధి కోసం కృషి చేయనున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Tags; Bhaskar Reddy as the Chairman of the Punganur Mandal Committee